Face Packs: ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్ లు సహజ పదార్థాల మిశ్రమాలు. ఇది వివిధ ప్రయోజనాల కోసం ముఖంపై అప్లై చేసుకోవడానికి ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని తెచ్చుకోవడానికి ఇవి సహజమైనవి. తక్కువ ఖర్చుతో కూడుకున్న ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ లు చర్మానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా ఇవి సులభంగా లభించే సహజ పదార్థాల నుండి తయారవుతాయి. ఇందులో చర్మానికి హాని కలిగించే ఎటువంటి కఠినమైన రసాయనాలు ఉండవు.

ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్:
టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిని తగినంత రోజ్ వాటర్ తో కలపండి.. ముఖం మీద అప్లై చేసి 15 లేదా 20 నిమిషాలు అలానే ఉంచుకోవాలి. ఈ పేస్ ప్యాక్ ఆయిల్ ను గ్రహించి మొటిమలను తగ్గిస్తుంది.
వేప, పసుపు ఫేస్ ప్యాక్:
ఒక పిడికెడు వేప ఆకులను గ్రైండ్ చేసి 1/2 టీ స్పూన్ పసుపు పొడి, తగినంత నీళ్లతో కలిపి పేస్టులా చేయాలి. దానిని ముఖం మీద రాసుకొని 15 లేదా 20 నిమిషాలు ఉంచండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని శుభ్రపరచడానికి, డీ టాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది. ఇది లేకపోయినా నిమ్మ, తేనె కూడా ఉపయోగించుకోవచ్చు.
బొప్పాయి, తేనె ఫేస్ ప్యాక్:
1/2 పండిన బొప్పాయిని మెత్తగా చేసి,1 టేబుల్ స్పూన్ తేనెతో కలిపి ముఖం మీద అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు ఉంచడం ద్వారా మొటిమలు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.
టీ ట్రీ ఆయిల్, అలోవెరా ఫేస్ ప్యాక్:
2-3 చుక్కల టీ ట్రీ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కలిపి ముఖం మీద అప్లై చేసి 10-15 నిమిషాలు పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా మొటిమలు మరియు వాపులను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది.
గంధం, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్:
2 టేబుల్ స్పూన్ల గంధపు పొడిని తగినంత రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖం మీద నిమిషాలు ఉంచాలి. ఈ ఫేస్ ప్యాక్ జిడ్డును పూర్తిగా తగ్గించి. మొటిమల బారిన పడే చర్మాన్ని ఉపశమనం చేస్తుంది..
YSRCP: ఆ ఒక్క మాటతో మొత్తం టర్నింగ్..!? వైసీపీని ట్రాప్‌లోకి లాగేసిన కొడాలి..?