Heart Attack: గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. వాటిని ముందుగానే గుర్తించగలిగితే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ముఖ్యంగా ఇక్కడ నొప్పి వస్తే అశ్రద్ధ చేయవద్దు అంటున్నారు.. అక్కడ నొప్పి వస్తె కచ్చితంగా గుండెపోటు వస్తుందా..!? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..!!
హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఇక్కడ నొప్పి వస్తుంది. చాలా సార్లు దవడ లేదా ఎడమ చేయి నొప్పి వస్తుంటే అది గుండెపోటు లక్షణాలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా ఈ రెండు చోట్లా నొప్పి వస్తే శ్రద్ధ చేయవద్దని వారు హెచ్చరిస్తున్నారు. సకాలంలో గుర్తించి గుండెపోటు నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు. తరచుగా ఎడమ చేయి నొప్పి లేదా దవడ నొప్పి వస్తుంటే మాత్రం తక్షణమే వైద్యుని సంప్రదించడం మంచిది.
కొంచెం దూరం నడిచిన ఆయాసం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా.. కొంచెం మెట్లు ఎక్కి దిగిన శ్వాస తీసుకోలేక పోయిన, మెట్లు దిగిన కాసేపటి తర్వాత కూడా ఆయాసం వస్తుంటే మాత్రం గుండెల్లో ఏదో సమస్య ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇది హార్ట్ ఎటాక్ ప్రారంభం దశ అని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణం మీకు కనిపిస్తే అసలు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. వారు సూచించిన పరీక్షలు చేయించుకున్న తరువాత అది గుండె పోటో కాదో నిర్ధారించుకోండి. ప్రారంభదశలోనే హార్ట్ ఎటాక్ లక్షణాలు గుర్తించి గుర్తించగలిగితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. లేదంటే గుండెపోటు కారణంగా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని గుర్తించి మసలుకోండి.