NewsOrbit
Horoscope దైవం

Daily Horoscope: ఏప్రిల్ 26 – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Share

Daily Horoscope in Telugu ఏప్రిల్ 26 – బుధవారం – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు. దీర్ఘ కాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

Daily Horoscope in Telugu April 19 2023
Daily Horoscope in Telugu April 26 2023

వృషభం
ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో కుటుంబమున ఉత్సహంగా గడుపుతారు. మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
మిధునం
ఋణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. రుణయత్నాలు చేస్తారు. ప్రయాణాలు ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
కర్కాటకం
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.
సింహం
చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగమునకొన్ని వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు.
కన్య
ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కొన్ని పనులలో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
తుల
ధన, వస్తు,వాహన లాభాలు ఉన్నవి. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయట పడగలుగుతారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి.
వృశ్చికం
చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి.

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Daily Horoscope in Telugu April 26 2023 Rasi Phalalu

ధనస్సు
ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. దూరప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరం అవుతుంది.
మకరం
స్థిరాస్తి లాభం కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దైవారాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి,వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
కుంభం
ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయులు నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.
మీనం
వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. ఆరోగ్యం మందగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..


Share

Related posts

Today Horoscope అక్టోబర్ 9th శుక్రవారం మీ రాశి ఫలాలు

Sree matha

బొట్టు పెట్టుకోవడం వలన ఫలితాలు ఇవే !

Sree matha

Today Horoscope డిసెంబర్ 5th శనివారం రాశి ఫలాలు

Sree matha