CM YS Jagan: ఆఫ్రికా దేశం సూడాన్ లో అంతర్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో అనేక మంది మన దేశ పౌరులు చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. వారిలో దాదాపు 50 మందికి పైగా తెలుగు వారు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సుడాన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు సీఎం జగన్.

ఉక్రెయిన్‌సంక్షోభం సమయంలో వ్యవహరించిన మాదిరిగానే విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎయిర్‌పోర్టులో వారిని రిసీవ్ చేసుకుని స్వస్థలాలకు చేరుకునే వరకూ అండగా నిలవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సుడాన్‌లో 56 మంది తెలుగు వారు ఉన్నట్టు తెలుస్తోందని అధికారులకు సీఎంకు వివరించారు.
Rajamouli: బాహుబలి 3 గురించి నోరు జారిన జక్కన్న!