NewsOrbit
Featured Horoscope దైవం న్యూస్

Today Horoscope మార్చి- 7 – మాఘమాసం – ఆదివారం. ధనయోగం కలుగుతుంది !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి 7 – – మాఘమాసం – ఆదివారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, ఆదివారం, తిథి: నవమి పగలు 4.47 వరకు తదుపరి దశమి, నక్షత్రం: మూల రాత్రి 8.59 వరకు తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: రాత్రి 7.26 నుండి 8.59 వరకు, పునర్ వర్జ్యం: రాత్రి తెల్లవారి 6.28 నుండి మర్నాటి ఉదయం 8.02 వరకు, దుర్ముహూర్తం: పగలు 4.49 నుండి సాయంత్రం 5.37 వరకు. అమృత ఘడియలు: పగలు 2.46 నుండి 4.19 వరకు, రాహుకాలం: పగలు 4.55 నుండి సాయంత్రం 6.24 వరకు

మేషరాశి Today Horoscope మార్చి- 7 – మాఘమాసం – ఆదివారం. అప్పుల బాధలు !

ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనుల్లో విషయాల్లో విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకున్న సమయానికి పూర్తి చేసుకోకపోవడం వల్ల వాయిదా పడతాయి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడడం మంచిది. మీలో ఉన్న కోపం వల్ల చిరాకు వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. విద్యార్థులు అనవసరమైన విషయాల మీద శ్రద్ధ చూపించి, చదువు ని నిర్లక్ష్యం చేస్తారు. అనవసరపు ఖర్చులను ఎక్కువగా చేస్తారు. అప్పుల బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో వచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటారు. ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు సంకట హర గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని స్వామికి గరికను సమర్పిం చండి.

వృషభరాశి Today Horoscope మార్చి- 7 – మాఘమాసం – ఆదివారం. ధనయోగం కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. వ్యాపారాల్లో లాభాలు అనుకూలిస్తాయి. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ధనయోగం కలుగుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. స్నేహితులతో అయిన వారితో కుటుంబ సభ్యులతో ఆనందంగా సఖ్యతగా ఉంటారు. అనారోగ్యాలకు దూరంగా ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో గొప్ప పదోన్నతి పొందుతారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.
రెమిడీః ఈరోజు శ్రీలలిత అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మిధునరాశి Today Horoscope మార్చి- 7 – మాఘమాసం – ఆదివారం. వ్యాపారాల్లో నష్టాలు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. తొందరపడి ఎదుటివారిని నమ్మడం వల్ల నమ్మక ద్రోహం జరుగుతుంది. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి, అనుకున్న పనులను సమయానికి పూర్తి కావు, వాయిదా పడతాయి. ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల నష్టాలు కలుగుతాయి. మీలో ఉన్న కోపం వల్ల తొందరపాటు తనం వల్ల మీరు అంటే ఇష్టపడే వారిని దూరం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు స్నేహితులతో కలిసి చదువు విషయంలో అశ్రద్ధగా వ్యవహరిస్తారు.
రెమిడీః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి- 7 – మాఘమాసం – ఆదివారం. పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. ఎదుటివారిని అర్థం చేసుకుంటారు. డబ్బులను పొదుపు చేస్తారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. అవసరానికి డబ్బులు అందుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని, అనారోగ్యానికి దూరంగా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. స్త్రీలకు లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

today horoscope march 7 in telugu
today horoscope march 7 in telugu

సింహరాశి Today Horoscope మార్చి- 7 – మాఘమాసం – ఆదివారం. అనారోగ్య సమస్యలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. సంపద తక్కువ ఖర్చు ఎక్కువవుతుంది. ధననష్టం జరుగుతుంది. ఆహారపు అలవాట్లను పాటించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువును నిర్లక్ష్యం చేస్తారు. వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

కన్యారాశి Today Horoscope మార్చి- 7 – మాఘమాసం – ఆదివారం. సమస్యల నుంచి బయట పడతారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఎంత కష్టమైనా సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయట పడతారు. స్నేహితుల సహకారం పొందుతారు. సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆప్తులు సంక్రమిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
రెమిడీః ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఆరాధించండి.

తులారాశి Today Horoscope మార్చి- 7 – మాఘమాసం – ఆదివారం. నిర్లక్ష్యంగా ఉంటారు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. రుణ బాధలు పెరుగుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు అనవసరపు విషయా లో అధికమై చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఇబ్బందులు ఎదురవుతాయి.
రెమిడీః ఈరోజు కాలభైరవాష్టకం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope మార్చి- 7 – మాఘమాసం – ఆదివారం. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు, వారి కోసం డబ్బు ఖర్చు పెడతారు. కోరికలు తీర్చుకుంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయత్నం చేయడం వల్ల ఫలితం లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. రుణబాధలు తగ్గిపోతాయి. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు అన్నపూర్ణా దేవిని ఆరాధించండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి- 7 – మాఘమాసం – ఆదివారం. ప్రయాణాలు వాయిదా !

ఈరోజు అనుకూలంగా లేదు. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. మీలో ఉన్న కోపం వల్ల, తొందరపాటు తనం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. నీటి సంబంధ అనారోగ్యాలు. చేపట్టిన పనులను వాయిదా వేస్తారు. కుటుంబంలో ఖర్చులు అధికమవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధన నష్టం కలుగుతుంది. ముఖ్యమైన విషయాలను, అవసరమైన పనులను మర్చిపోతారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులు అనవసరపు విషయాల్లో శ్రద్ధ చూపించి చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి.
రెమిడీః శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

మకర రాశి Today Horoscope మార్చి- 7 – మాఘమాసం – ఆదివారం. పోటీపరీక్షల్లో విజయం !

ఈరోజు లాభకరంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. స్నేహితుల ద్వారా ధనలాభం కలుగుతుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణబాధలు తగ్గిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బాకీలను వసూలు చేసుకుంటారు. అప్రయత్న ధనలాభం కలుగుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. స్త్రీలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.
రెమిడీః లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభరాశి Today Horoscope మార్చి- 7 – మాఘమాసం – ఆదివారం. కార్యాలయాల్లో ఇబ్బందులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు అనర్ధాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువు విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి.
రెమిడీః ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

మీన రాశి Today Horoscope మార్చి- 7 – మాఘమాసం – ఆదివారం. శుభకార్యాల్లో పాల్గొంటారు !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సమస్యలు తగ్గిపోయి అందరూ కలిసి మెలిసి ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి పూర్తిచేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అనారోగ్య విషయాలను తగ్గించుకొని సమస్త ఆరోగ్యాన్ని పొందుతారు. చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విలువైన బంగారు ఆభరణాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం పారాయణ చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N