NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Bala krishna :సంస్కారం ఉందంటూనే అలా చేసిన బాల‌య్య… కొడాలి నాని ఏమంటున్నారంటే…

Bala krishna : తెలుగుదేశం పార్టీ నేత‌, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ వైఖ‌రి విభిన్నం. రాజ‌కీయాల్లో ఆయ‌న తీరు ఒక్కోసారి తీవ్రంగా వార్త‌ల్లో నిలుస్తుంది. ఈ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కోపం వచ్చిందంటే ఆగదు. పబ్లిక్‌లో ఉన్నా ప్రైవేట్‌గా ఉన్నా.. ఆయన ప్రవర్తన ఒకేలాగా ఉంటుంది. కోపం వచ్చిందంటే.. అవతలి వ్యక్తికి ఒకటి తగిలించాల్సిందే.. ఇప్పటికే పలు సార్లు తన అభిమానులపై చేయి చేసుకున్న బాలయ్య తాజాగా హిందూపురంలో మరోసారి సీన్ రిపీట్ చేశారు. దీనిపై విప‌క్షం ఓ రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చింది.

Bala krishna
Bala krishna

Bala krishna  బాల‌య్య ఏం చేశారు?

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా త‌న నియోజక వర్గంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఓ అభిమానిపై తన మార్క్ కోపాన్ని చూపించారు.9వ వార్డులో ఓ ఇంట్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్న సమయంలో.. అక్కడే ఉన్న అభిమాని వీడియో తీసేందుకు ప్రయత్నించాడు.. అది చూపి కోసంతో ఊగిపోయిన బాలయ్య.. అతడిపై చేయిచేసుకున్నాడు.. ఆ వీడియో, ఫొటోలను డిలీట్ చేయాలంటూ తన సెక్యూరిటీని ఆదేశించారు.

అంత‌కుముందు బాల‌య్య ఏమ‌న్నారంటే..

మంత్రి కొడాలి నానిపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విరుచుకుపడ్డారు. నేను తిడితే అంత బూతులు తిట్టేవారు ఉండరన్న ఆయన.. నాకు ఒక పనికాదు.. ఎన్నో పనులు ఉంటాయన్నారు. తాను చేస్తున్నది ప్రజాసేవే… విమర్శిస్తే ఊరుకోనని కౌంటర్ ఇచ్చిన ఆయన.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్‌గా రోగులకు సేవలు అందిస్తున్నాన్నారు. సినిమాల ద్వారా ప్రజలకు వినోదం అందిస్తున్నా. నాకు సంస్కారం ఉంది… నోరు పారేసుకుంటే.. ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చారు.

నాని ఏం త‌క్కువ తిన‌లేదు

బాలయ్య వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని అదే స్థాయిలో స్పందించారు. హైదరాబాద్‌లో ఉండేవాళ్లు ప్రజా సమస్యలపై మాట్లాడితే… ప్రజలు నవ్వుకుంటారని కామెంట్ చేశారు. “బాలకృష్ణ సినిమాలు చేసుకుంటారు పాటలకు మలేషియా, ఫైట్లకు హాంకాంగ్ ఒక్కొక్క సీనుకు ఒక్కో చోటుకు వెళ్తుంటారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. విదేశాలు తిరుగుతూ బాలయ్య మాట్లాడుతుంటే.. ఆయన పక్కనున్న నాయకులు, కార్యకర్తలు కూడా నవ్వుకుంటారు. ఏ సీరియస్ అని ఆయన అంటుంటారు.. ఈయన చెప్పేది ఏది సీరియస్‌గా తీసుకోవాలో వారికి అర్థం కాని పరిస్థితి“ అని సెటైర్లు వేశారు. బాలకృష్ణ‌ ఆటలో అరటి కాయలాంటి వాడు.. వాళ్ల బావ రాసిచ్చిన స్ర్కిప్టు చదువుతుంటారు.. ఆయన కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడాలి నాని అన్నారు. ఇదే సంద‌ర్భంలో సంస్కారం గురించి చెప్పే బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకోవ‌డం ఏంట‌ని మంత్రి ప్ర‌శ్నించారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N