దేశా వ్యాప్తంగా నకిలీ ఔషద కంపెనీలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 20 రాష్ట్రాల్లో 70కిపైగా ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దాడులు నిర్వహించింది. నిబంధనలకు పాటించకుండా నకిలీ మందులు ఉత్పత్తి చేస్తున్న 18 కంపెనీల లైసెన్సులను రద్దు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 18 కంపెనీల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు మరో 25 ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

గత ఏడాది గాంబియా, ఉజ్జెకిస్థాన్ దేశాల్లో ఇండియా తయారీ దగ్గుమందు వాడిన తర్వాత చినారులు మృత్యువాత పడ్డారు. ఆ నేపథ్యంలో ఉజ్జెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మారియన్ బయోటెక్ తయారు చేసిన అంబ్రోనాల్ సిరప్, డీఓకే – 1 మాక్స్ సిరప్ లను పరీక్షించగా వాటిలో అధిక మొత్తంలో కలుషితాలు, డైథేలీన్ గ్లైకాల్/ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లుగా నిర్దారణ అయ్యింది. ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఈ దగ్గు మందు తయారు చేసిన రెండు కంపెనీలను ప్రభుత్వం మూసి వేయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. ఫార్మా కంపెనీలపై దాడులు జరగవచ్చని గత 15 రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయితే ఆకస్మికంగా ఈ భారీ దాడులు నిర్వహించి ఈ చర్యలు చేపట్టింది.
అమరావతి కేసులో ఏపి సర్కార్ కు లభించని ఊరట ..