NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Wrestlers Protest: తమ నిరసనకు మద్దతు ఇస్తారా..? వచ్చేయండి .. రాజకీయ పార్టీలకు రెజ్లర్ల స్వాగతం

All parties welcome to join our protest wrestlers demand action against wfi chief

Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు వివరాలను వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బజ్ రంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేశ్ ఫోగాట్ సహా అగ్రశ్రేణి రెజర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆదివారం రాత్రి అంతా దీక్షా శిబిరంలోన ఉన్న క్రీడాకారులు సోమవారం ఉదయం కూడా తన నిరసన కొసాగిస్తున్నారు. బ్రిజ్ బూషణ్ పై పోలీసులు కేసు నమోదు చేసేంత వరకూ తమ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. బ్రిజ్ భూషణ్ పై సంచలన ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరిలో రెజ్లర్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పలు రాజకీయ పార్టీలు వీరికి మద్దతు పలుకుతూ దీక్షలో పాల్గొనేందుకు ప్రయత్నించగా క్రీడాకారులు అందుకు తిరస్కరించారు. అయితే ఈ సారి తాము అలా చేయబోమని బజరంగ్ పునియా తెలిపారు.

All parties welcome to join our protest wrestlers demand action against wfi chief
All parties welcome to join our protest wrestlers demand action against wfi chief

 

తమ ఆందోళనకు మద్దతు ఇచ్చే వారు ఎవరైనా తమతో ధర్నాలో పాల్గొవచ్చని బజరంగ్ పునియా తెలిపారు. ఈ సారి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ఏ పార్టీ అయినా సరే తమ ఆందోళనకు మద్దతు ఇచ్చి దీక్షలో కూర్చోవచ్చని తెలిపారు. అయితే తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పునియా వివరించారు. గతంలో తాము నిరసన చేపట్టినప్పుడు తమకు తప్పుదోవపట్టించారనీ, ఈ సారి తాము ఎవర్నీ గుడ్డిగా నమ్మమని, కేసు నమోదు చేసే వరకూ దీక్ష కొనసాగుతుందని వినేశ్ ఫొగాట్ తెలిపింది.

బ్రిజ్ భూషణ్ పై ఓ మైనర్ సహా ఏడుగురు బాలికలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోలేదని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. రెజ్లర్ల ఆరోపణలైప దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలో ఏర్పాటైన ఆరుగురు సభ్యుల పర్యవేక్షణ కమిటీ ఈ నెల మొదటి వారంలో దర్యాప్తు నివేదికను కేంద్రానికి సమర్పించింది. అయితే ఆ దర్యప్తు నివేదికను ప్రభుత్వం ఇప్పటి వరకూ బహిర్గతం చేయలేదు. దీంతో మరల రెజ్లర్లు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. రెజ్లర్లు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. క్రీడాశాఖ ఏర్పాటు చేసిన కమిటీ నుండి దర్యాప్తు నివేదకను కోరినట్లు పేర్కొన్నారు.

Breaking: తాడిపత్రిలో హైటెన్షన్ .. జేసీ ప్రభాకరరెడ్డి అరెస్టు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N