NewsOrbit
జాతీయం న్యూస్

బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు .. 8 మంది దుర్మరణం

తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని ప్రభుత్వ అనుమతితో నిర్వహిస్తుంటే మరి కొన్ని ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తుంటారు. బాణా సంచా తయారీ ఒక కుటీర పరిశ్రమ మాదిరిగా తమిళనాడులో నిర్వహిస్తుంటారు. అయితే బాణాసంచా తయారీ కేంద్రాల్లో సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల గతంలో ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా ఇవేళ బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహరా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.

కృష్ణగిరి పట్టణంం పాత పేటట ప్రాంతంలో బాణాసంచా భద్రపరిచిన గోడౌన్ లో పేలుడు సంభవించింది. ఈ గోడౌన్ నివాస సముదాయాల మధ్య ఉండటం వల్ల పేలుడు ధాటికి మూడు ఇళ్లు కుప్పకూలాయి. ఈ భారీ పేలుడు వల్ల కొందరు 200 మీటర్ల దూరంలో పడిపోయారు. మరో పక్క శిధిలాల కింద మరి కొందరు చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించి వెంటనే మంటలు చెలరేగాయిని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షణాల్లోనే ఈ ప్రాంతం అంతా మంటలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తొంది. గాయపడిన వారిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిధిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో రవి (45), అతని భార్య జయశ్రీ (40), రితిక (17), రితీశ్ (15), ఇబ్రా (22), సిమ్రాన్ (20), సరసు (50), రాజేశ్వరి (50) మృతి చెందారని పోలీసులు తెలిపారు.

గ్యాస్ సిలెండర్ లీకేజీ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసుల ప్రాధమిక విచారణ లో తేలింది. కృష్ణగిరి జిల్లా కలెక్టర్ సరయు, ఎస్పీ సరోజ్ కుమార్ టాగూర్, కృష్ణగిరి ఎమ్మెల్యే అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Breaking: వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం .. మాజీ విచారణ అధికారి రామ్ సింగ్ పై సీబీఐ డైరెక్టర్ కు ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదు

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !