డయాబెటిస్ వస్తే ఇక తమ శృంగార జీవితం ఆగిపోయినట్టే అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇలా భావించడం కేవలం అపోహ మాత్రమే అని పరిశోధకులు తెలియచేస్తున్నారు . కొన్ని కొన్ని జాగ్రత్తలతో పాటు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే పూర్తి ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి లాగా శృంగార అనుభూతిని పొందవచ్చని నిపుణులు తెలియచేస్తున్నారు. షుగర్ వ్యాధితో బాధపడే వారికి అలసట, అతి మూత్రం, ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల అతి దాహం , ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అయితే షుగర్ లెవెల్స్ నార్మల్ వద్ద ఉండేలా మెయిన్ టెయిన్ చేస్తే మాత్రం షుగర్ ఉన్నాకూడా శృంగారం చేయడం సులభమని నిపుణులు తెలియచేస్తున్నారు .అన్నిటికన్నా ముఖ్యంగా శృంగారం చేసే ముందు బ్లడ్లో షుగర్ లెవల్స్ ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవాలి. అయితే తరచూ శృంగారం చేస్తూ ఉండడం వలన కూడా షుగర్ అదుపు లోకి లోకి వస్తుంది అని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక షుగర్ ఉన్నవారు తమ శృంగార జీవితాన్ని ఆనందం గా అనుభవించాలంటే మాత్రం మద్యానికి దూరంగా ఉండక తప్పదు .అలాగే ఫోర్ ప్లే ఎక్కువ చేయకుండా అసలు పనిముగించేస్తే మీకు సంతృప్తి కలుగుతుంది. ఇక షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండ వ్యాయామం చేయడం వలన కూడా శృంగార జీవితం పరిపూర్ణం గా అనుభవించేందుకు అవకాశం ఉంటుంది.ఆల్కహాల్ తీసుకుని శృంగారంలో పాల్గొనడం వల్ల బ్లడ్ షుగర్ వెల్స్ తగ్గుతాయి.
ఈ రెండు రెండు పనులు ఒకేసారి చేయడం షుగర్ ఉన్న వారికి మంచిది కాదు.ఇక ఆహారం విషయానికి వస్తే గ్రీన్ వెజిటేబుల్స్, తాజాగా ఉండే కాయగూరలు ఆహారంలో తీసుకోవడం వల్ల శృంగారం లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వీటితో పాటుగా ఎప్పటికప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి.