భూమిలోంచి పెల్లుబుకుతున్న లావా

Share

త్రిపురలో లావాలాంటి ద్రవం భూమిలోనుంచి పెల్లుబుకుతున్నది. భూ గర్భంలో అగ్నిపర్వతం బద్దలైందా అన్నట్లుగా లావా వంటి ద్రవం వస్తుండటంతో జనం భయంతో వణికిపోతున్నారు. జాలీఫా గ్రామంలోని ఒక విద్యుత్ స్తంభం వద్ద ఈ ద్రవం భూమి లోనుంచి వెలువడుతోంది.భూ కంపాలు సంభవించడానికి అవకాశం ఉన్నసస్మిక్ జోన్ లో త్రిపుర కూడా ఉండటంతో సర్కార్ లో కూడా ఈ ద్రవం భూమిలో నుంచి బయటకు ఉబికి వస్తుండటంతో అప్రమత్తమైంది. ఈ ఏడాదిలో ఇటువంటి సంఘటన జరగడం ఇది మూడో సారి.

భూమి కంపించే అవకాశం ఉందన్న ఆందోళన జాలిఫా గ్రామస్తులలో వ్యక్తం అవుతున్నది. లావా వంటి ఈ ద్రవం భూమిలోనుంచి వెలువడటానికి కారణాలపై అధ్యయనం చేసి జనంలో ఆందోళనను తొలగించే ప్రయత్నాలు చేయాలని త్రిపుర సర్కార్ సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.


Share

Related posts

బ్రేకింగ్ : బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య

ramu T

TDP: అచ్చెన్న వీడియో వైరల్ చేసిన వైసీపీ..! జగన్ పై సీరియస్ కామెంట్స్ చేసిన అచ్చెన్న..!!

somaraju sharma

ఆ డాక్టరుకు.. 49 మంది పిల్లలు!

Kamesh

Leave a Comment