Acharya : ఆచార్య.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో రాబోతున్న 152 వ సినిమా. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరొక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడు మిల్లి ఫారెస్ట్ లో శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్ తో దాదాపు ఆచార్య టాకీపార్ట్ కంప్లీట్ అవుతుందట. కాగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రాం చరణ్ పాల్గొంటున్నారు.
అంతేకాదు చిరు – చరణ్ ల మీద కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించడం తో పాటు ఇద్దరి మీద ఒక అద్భుతమైన సాంగ్ ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతక ముందు రాం చరణ్ నటించిన మగధీర, బ్రూస్ లీ సినిమాలలో చిరు కనిపించి కొన్ని సెకన్ల పాటు ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. అలాగే మెగాస్టార్ రీ ఎంట్రి సినిమా ఖైదీ నంబర్ 150 లో చరణ్ ఒక సాంగ్ లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఆచార్య సినిమాలో సాంగ్ మొత్తం లో కనిపించి సందడి చేయబోతున్నారట.
Acharya : ఆచార్య లో చిరు – చరణ్ కలిసి వేసే డాన్స్ స్టెప్స్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంటాయని తెలుస్తోంది.
ఇక ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ కొన్నేళ్ళపాటు చెప్పుకునేలా ఉంటుందని ఇద్దరు కలిసి వేసే డాన్స్ స్టెప్స్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంటాయని తెలుస్తోంది. ఇందుకు కొరటాల శివ పక్కా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ – మాట్నీ మూవీస్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కాగా సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మణిశర్మ అదరగొట్టబోతున్నాడని చెప్పుకుంటున్నారు.