Big Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంటి సభ్యులు పై రివ్యూ ఇచ్చినా నటి ప్రియ..!!

Share

Big Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో రసవత్తరమైన వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ గ్రూపులు..గొడవలు…సింపతీ ప్లే చేసే వాళ్ళు ..స్ట్రాటజీ గా ఆలోచిస్తూ.. ఎత్తులు వేస్తున్న వాళ్ళు మరొక పక్క..సైలెంట్ గా అంతా గమనిస్తున్న వాళ్ళు ..ఇలా ఎవరికి వారు మొదటి వారంలో హౌస్ లో తమదైన శైలిలో దూసుకుపోతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే హౌస్లో చాలా సైలెంట్ గా రాణిస్తున్న వారిలో నటి ప్రియా కూడా ఒకరు. సీరియల్ లో.. సినిమా రంగంలో మంచి పేరు సంపాదించిన ఈ కంటెస్టెంట్ .. హౌస్ లో ఇంటి సభ్యులందరి ఆటతీరును గమనిస్తోంది. ఇదే తరుణంలో ఉమాదేవి, లహరితో కలిసి ముచ్చట్లు పెట్టిన ప్రియ.. ఇంటి సభ్యుల పై తనదైన శైలిలో రివ్యూ ఇవ్వడం జరిగింది. అన్‌సీన్‌ వీడియో ఎపిసోడ్లో నటి ప్రియా ఇంటిలో సభ్యుల గురించి తనదైన శైలిలో తన అభిప్రాయాన్ని తెలిపింది.

Bigg Boss 5 Telugu: Bigg Boss Priya shares a heartbreaking story of her  daughter's death

దీనిలో భాగంగా ఫస్ట్ సన్నీ గురించి మాట్లాడుతూ… ‘తనకు అన్నీ తెలుసనుకుంటాడు, కానీ కొంతే తెలుసు. మానస్‌ సైలెంట్‌గా అందరినీ గమనిస్తూనే ఎ‍ప్పుడు మాట్లాడాలో అప్పుడు గట్టిగా రియాక్ట్‌ అవుతాడు. నటరాజ్‌ మాస్టర్‌.. అందరూ తన మాట వింటున్నాడని ఫీలవుతాడు. కానీ కొన్నే వింటాం.. ఇక లోబో విషయానికి వస్తే.. సడన్‌గా నిద్ర లేచి కంటెంట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. రవికి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేది తెలుసు. ఆయనకు చాలా అనుభవం ఉంది. ఎక్కడ తగ్గాలో? ఎక్కడ నెగ్గాలో తెలుసు. ఇక కాజల్‌.. ఆమెకు అన్నీ తెలుసేమో అనుకున్నా ఇక్కడ అవేమీ పని చేయవు. తను మెచ్యూర్డ్‌ అనుకుంటుంది కానీ అస్సలు కాదు’ అని చెప్పింది ప్రియ. ఇక కంటెస్టెంట్ సీరి చాలా స్మార్ట్ గేమ్ ప్లే చేస్తోంది. ఇక ఇదే సమయంలో … హౌస్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండే వారి జోలికి ఆమె వెళ్లడం లేదని పేర్కొంది. శ్వేత వర్ణ మాత్రం తనపై ఎటువంటి నెగిటివ్ టాక్ రాకుండా ఎవరు ఏది అడిగినా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ.. అన్నీ చేసి పెడుతూ ఉంది ఆమె ఖచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఆమె స్వభావం ఏమో తెలియదు అంటూ ప్రియ పేర్కొంది.

 

ఇక ప్రియాంక సింగ్… అనేక అవమానాలు జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. ఎవరితో ఎలా వ్యవహరించాలి ఎలా సర్దుకు పోవాలి అనేది ఆమెకు బాగా తెలుసు అని స్పష్టం చేసింది. సరియు కూడా మంచి ఆలోచనతో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండెట్ గా హౌస్ లో అడుగు పెట్టింది.. చాలా మెచ్యూర్ ఆలోచిస్తోంది, నా మీద కూడా చాలా తెలివైంది అంటూ నటి ప్రియ తనదైన శైలిలో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లపై రివ్యూ ఇవ్వడం జరిగింది. మరోపక్క ఇది ఆటలో బాగమే కావచ్చు అభిప్రాయాలు రాబోయే రోజుల్లో మారవచ్చు అంటూ షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా నటి ప్రియా ఇచ్చిన రివ్యూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోపక్క నెటిజన్లు మరియు బిగ్బాస్ ప్రేక్షకులు… ప్రియా కూడా చాలా కంట కనిపెడుతూనే.. హౌస్ లో మంచి గేమ్ ప్లే చేస్తుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి వారం గడిచే పరిస్థితి ఏర్పడటంతో… బిగ్ బాస్ ప్రేక్షకులు… వీకెండ్ ఎపిసోడ్ నో నాగార్జున ఏ విధంగా వ్యవహరిస్తారు అనేదాని గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు.


Share

Related posts

రవితేజ క్రాక్ ట్రైలర్ చూసి షాకింగ్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు ..?

GRK

జవాన్ కిడ్నాప్ కాలేదు

sarath

KCR: మోత్కుప‌ల్లికి కేసీఆర్ కండువా క‌ప్పేది అందుకేనా?

sridhar