Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న యాంకర్ సుమ..!!

Share

Bigg Boss Telugu 5: టిఆర్పి రేటింగు లలో… బిగ్ బాస్(Bigg Boss) షో పలు భాషలలో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. తెలుగు లో కూడా నాలుగు సీజన్లలో భారీ ఎత్తున బిగ్ బాస్(Bigg Boss) షో కి… రేటింగ్ లు వచ్చాయి. కానీ ఈసారి సీజన్ ఫైవ్ కి మాత్రం పెద్దగా ఆదరణ లేదన్న టాక్ నడుస్తోంది. వీకెండ్ ఎపిసోడ్ లకు మాత్రం… టిఆర్పి రేటింగ్ నమోదు అవుతున్నట్లు.. మిగతా రోజులలో అసలు షో కి.. కనీస ఆదరణ కూడా దక్కడం లేదని తెలుస్తోంది. ఐపీఎల్ ఆ తర్వాత ఇటీవల స్టార్ట్ అయిన వరల్డ్ కప్ మ్యాచ్ లు… కారణంగా షోకి సరైన ఆదరణ లేదని.. జనాలు చెపుతున్నారు.

Bigg Boss Telugu Season 5 promo out. Watch video - Television News

పైగా హౌస్ లో.. ఈ సీజన్ లో ఎక్కువగా కొత్త ముఖాలు రావటంతో పాటు షో టైమింగ్ రాత్రి పది గంటలకి కావడంతో… అటు ఇటు కాని టైం లో… షో ప్రసారం కావడం కూడా పెద్ద మైనస్ అని దానివల్ల కూడా.. ఈ సీజన్ కి… సరైన ఆదరణ దక్కడం లేదన్న టాక్ ఉంది. పైగా ఇప్పటివరకూ ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా హౌస్ లోకి వెళ్లకపోవటం తో పాటు… టాప్ మోస్ట్ కంటెస్టెంట్ లు.. కాంట్రవర్సీ క్రియేట్ చేసే కంటెస్టెంట్ లు ముందుగానే ఇంటి నుండి పంపించడంతో..షో..చాలా డల్ అయిపోయినట్లు వీక్షకులు చెప్పుకొస్తున్నారు. రచ్చ రద్దు చేసే కంటెస్టెంట్ లు ముందుగానే ఇంటి నుండి ఎలిమినేట్ చేయడమైనది అయిందని వీటిలో ప్రస్తుతం సన్నీ మినహా మిగతా వాళ్ళంతా మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారని అంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే సీజన్ ఫైవ్  సగం పూర్తి కావడంతో.. మిగతా సీజన్ కి అయినా ఆదరణ దక్కేలా… షో నిర్వాహకులు తాజాగా సరికొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లోకి.. సరికొత్త సెలబ్రిటీలను పంపించడానికి రెడీ అవటం జరిగిందట. గత సీజన్ లో ఆడిన కంటెస్టెంట్ లు.. అదే రీతిలో సెలబ్రిటీలను హౌస్ లోకి తీసుకు రావడానికి షో నిర్వాహకులు సరికొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం.

Anchor Suma sends monetary aid to her staff

ఈ దెబ్బతో టిఆర్పి రేటింగులు బాగా పెరిగే రీతిలో…

దీనిలో భాగంగా యాంకర్ సుమ(Anchor Suma).. దీపావళి(Diwali) స్పెషల్ ఎపిసోడ్ కి… బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీజన్ వన్ లో… ఎన్టీఆర్(NTR) హోస్ట్ గా చేసిన సమయంలో యాంకర్ సుమ బిగ్ బాస్ షో లోకి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సీజన్ ఫైవ్ లో… తీసుకురావడానికి షో నిర్వాహకులు రెడీ అయ్యారు అని అంటున్నారు. దీపావళి సందర్భంగా హౌస్ లో సరికొత్త వాతావరణం క్రియేట్ చేయాలని ఈ దెబ్బతో టిఆర్పి రేటింగులు బాగా పెరిగే రీతిలో.. ఇంటిలో సరికొత్త గేమ్స్ మరియు ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తున్నట్లు… వార్తలు వస్తున్నాయి. అంతమాత్రమే కాకుండా… యాంకర్ సుమ కి హౌస్ లో స్పెషల్ పవర్ ఇచ్చినట్లు.. దాంతో ఆమె.. ఎలిమినేషన్ కి నామినేట్ అయిన కంటెస్టెంట్ లలో ఒకరిని సేవ్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. అంతమాత్రమే కాకుండా ఈసారి హౌస్ లో సుమ ప్రత్యేకమైన వంటకం ఇంటి సభ్యులకు.. దీపావళి పండుగనాడు చేయనున్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే దీపావళి సందర్భంగా బిగ్ బాస్(Bigg Boss) షోలో… స్పెషల్ ఎపిసోడ్ లతో… సరికొత్త సెలబ్రిటీలను హౌస్ లోకి తీసుకువచ్చి.. షోకి బాగా ఆదరణ దక్కెలా ప్లాన్ చేస్తున్నారట షో నిర్వాహకులు. 


Share

Related posts

కోవిడ్ వ్యాప్తిని అరిక‌ట్టే డివైస్‌.. యువ ఇంజినీర్ రూప‌క‌ల్ప‌న‌..!

Srikanth A

BJP: బీజేపీ విష‌యంలో బండి సంజ‌య్ ఆశ్చ‌ర్య‌పోయే మాటలు

sridhar

గుడ్ న్యూస్.. ‘ఫింగర్ ప్రింట్’తో క్యాష్ విత్ డ్రా..!

Teja