Anchor Suma : యాంకర్ సుమ Anchor Suma అంటేనే పంచ్ లకే మహారాణి. తను పంచ్ వేస్తే వేరే వాళ్లు మాట్లాడటానికి ఏం ఉండదు. ఆమె వేసే జోకులు, పంచులు అలాగే ఉంటాయి మరి. అందుకే.. యాంకర్ సుమను ఫుల్లు డిమాండ్. ఎటువంటి పరిస్థితినైనా.. తన గుప్పెట్లోకి తెచ్చేసుకుంటుంది సుమ. అది సుమకు ఉన్న టాలెంట్. అసలు.. సుమ.. ప్రతిరోజు ఎన్ని షోలలో చేస్తోందో ఎవరికి తెలుసు. తెలుగులో ఉన్న ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లలో ప్రసారమయ్యే అన్ని షోలలో ఎక్కువగా సుమనే యాంకర్ గా కనిపిస్తుంది.

యాంకర్ సుమ.. ఈటీవీలో వచ్చే స్టార్ మహిళ అనే ప్రోగ్రామ్ లోనూ యాంకర్ గా చేస్తోంది. స్టార్ మహిళ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సుమనే యాంకర్. అప్పట్లో స్టార్ మహిళ అనే ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయిందంటే దానికి కారణం సుమనే.
Anchor Suma : స్టార్ మహిళ లేటెస్ట్ ప్రోమో విడుదల
అయితే.. తాజాగా స్టార్ మహిళ లేటెస్ట్ ప్రోమో విడుదల కాగా.. అందులో యాంకర్ సుమ వేసిన పంచ్ మాత్రం మామూలుగా లేదు. స్టార్ మహిళకు వచ్చిన ఓ కంటెస్టెంట్.. బాగా భయపడిపోయింది. దీంతో.. సుమ.. ఆమెతో మాట్లాడుతూ.. మీరెందుకు భయపడుతున్నారు. టెన్షన్ తీసుకోకండి.. అంటూ సుమ తన కంగారును తగ్గించే ప్రయత్నం చేసినా.. తను మాత్రం ఇంకా భయపడుతూనే ఉన్నది. మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే.. తన భర్తంటే భయం అంటూ చెప్పేసింది. ఎందుకు భయం అంటే భర్త కదా.. భయపడాలి కదండి.. అనగానే.. మీరు భయపడతారేమో… నేను మాత్రం నా భర్తను భయపెడుతా.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సుమ.
దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. మీరు కూడా చూసేయండి.