NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆంధ్రజ్యోతి లో రాతలు… టిడిపిలో మంటలు..! ఇది ఎప్పటినుంచో….

ఆంధ్రజ్యోతి పత్రిక అన్నా…. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ అనా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తాయని అది ఎప్పటి నుండో ప్రజల్లో బలంగా నాటుకుపోయిన భావన. అందుకు తగ్గట్టుగానే ఆ పత్రికలో మరియు ఛానల్లో వారికి అనుకూలంగా వార్తలు, కథనాలు ప్రచురితం కావడం గమనార్హం. అలాంటి పత్రికలో గురువారం ‘టార్గెట్ టిడిపి’ పేరుతో ప్రచురించిన శీర్షిక ఇప్పుడు టిడిపి పార్టీలో మంటలి రేపింది. సహజంగా టిడిపికి నష్టం కలిగించే అంశాలను ఆ పత్రికలో ప్రచురించరు. ఇప్పుడు ఏపీ బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు కొత్తగా నియామకమైన నేపథ్యంలో దీని వెనుక బీజేపీ వ్యూహం ఇదే అంటూ విశ్లేషిస్తూ వారు రాసిన కథనం టిడిపి పార్టీకి నష్టం చేకూర్చేలా ఉంది.

 

Arrest warrant against AP CM Chandrababu Naidu in 2010 case

జ్యోతి చేసిన విశ్లేషణ ఏమిటంటే…. పశ్చిమ బెంగాల్ మరియు త్రిపురలో ఎలాంటి రాజకీయ వ్యూహాన్ని బిజెపి అమలు చేసిందో అలాంటి వ్యూహంలో భాగంగా ఏపీలో కూడా కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజుని తీసుకువచ్చారు అన్నది సారాంశం. బిజెపి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం సిపిఎం ను దెబ్బతీయడమేనని ఇదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా బలంగా ఉన్న ప్రతిపక్ష సిపిఎం ను కూకటివేళ్లతో సహా పెకళించడం వల్ల బిజెపి బలపడుతుందని…. రానున్న ఎన్నికల్లో అలాగే బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వారు రాసుకొచ్చారు. 

అందరికీ సోము వీర్రాజు టిడిపి అనే పదం వింటనే ఎగిరి పడతారని తెలుసు. ఇప్పటికే తమ పార్టీలోని చాలామందికి టిడిపి వారు వ్యూహాత్మకంగా టికెట్లు ఇప్పించారని ఆరోపణలు కూడా వీర్రాజు చేశారు. అందుకే వీర్రాజుని ఇక టీడీపీకి పుట్టగతులు లేకుండా చేయమని పార్టీ ప్రెసిడెంట్ గా నియమించినట్లు చెబుతున్నారు. 

ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరీ ముఖ్యంగా సుజనాతో దోస్తీ…. చంద్రబాబు డబ్బులు ఇచ్చి లక్ష్మీనారాయణ తో మాట్లాడిస్తున్నారని విజయసాయిరెడ్డి పదేపదే చేసిన ఆరోపణలు కూడా ముప్పు తెచ్చాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు అంటూ వార్తలు రావడం గమనార్హం. సోము వీర్రాజు నియామకం టిడిపికి గడ్డురోజులు అనే అభిప్రాయం అందరి మనసులో ఉన్నా అదే విషయాన్ని ఇలా ఆంధ్ర జ్యోతి చెపడం తెదేపాని విస్మయానికి గురి చేసింది. 

ఇప్పటికే ఈనాడు ఇటువంటి కథనాలు రాయడం మొదలు పెట్టిన తర్వాత…. ఎంతో పాపులర్ అయిన జ్యోతి శీర్షిక లో ఇలా రాయడం టిడిపికి ఒక రకంగా వార్నింగ్ అని చెప్పాలి. నిజంగా వారు అన్నట్టు బిజెపి వ్యూహం ఫలిస్తే మాత్రం టిడిపి విఅప్రీతంగా బలహీనపడడం ఖాయం.

author avatar
arun kanna

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N