పాపులర్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’కు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా ఇప్పటివరకు ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడో సీజన్ ప్రారంభం కానుంది. ఆరో సీజన్ ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయిన విషయం తెలిసిందే. అందుకే ఈ సారి పక్కా ప్లాన్‌తో బిగ్‌బాస్ ముందుకు వస్తుంది. అయితే ఈ సారి ఏడో సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కన్‌ఫర్మ్ అని తెలుస్తోంది. ఈ సారి బిగ్‌బాస్ షోలో గ్లామర్ డోస్ మరింతగా పెంచారు. సీరియల్ యాక్టర్స్, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్స్, బుల్లితెర సెలబ్రిటీలతో షో కళకళలాడనుంది.

సీజన్-7లో ఒకరిద్దరు తప్పితే అందరూ కొత్త వాళ్లే. ఆ ఇకరిద్దరు కూడా సీరియల్స్, యూట్యూబ్ చూసే వాళ్లకు తప్పితే నార్మల్ ఆడియన్స్‌కు వాళ్లెవరో తెలియదు. సీజన్-6లో కూడా ఇదే పరిస్థితి. బిగ్‌బాస్ షోపై స్టార్ సెలబ్రిటీలు పట్టించుకోవడమే మానేసినట్లు తెలుస్తోంది. అందుకే చాలా వరకు బుల్లితెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, జబర్దస్త్ కమెడియన్స్, టీవీ యాంకర్స్, సింగర్స్ కేటగిరీలకు సంబంధించిన వాళ్లని తీసుకుంటున్నారనే టాక్ బయట వినిపిస్తోంది.
ఇప్పటికే సీజన్-7 కంటెస్టెంట్లుగా.. శుభశ్రీ (రుద్రవీణ ఫేమ్), సింగర్ దామిని, పూజా మూర్తి (గుండమ్మ కథ సీరియల్), అనుదీప్ చౌదరి, కార్తీకదీపం శోభా శెట్టి, ఆట సందీప్ దంపతులు, అంజలి పవన్, పల్లవి ప్రశాంత్, అనీల్ గీలా (మై విలేజ్ షో), శీతల్ గౌతమ్ (యూట్యూబర్), మహేష్ ఆచంట (రంగస్థలం మహేష్), అన్షు రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ సీజన్-7లో బుల్లితెర నటి అన్షు రెడ్డి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎవరు? ఆమె జననం, విద్యాభ్యాసం, వయసు, కెరీర్ ప్రారంభం, ఆమె ఇష్టాలు తదితర విషయాలను ఈ రోజులు తెలుసుకుందాం..

అన్షు రెడ్డి జననం, విద్యాభ్యాసం
1992 జనవరి 29వ తేదీన అన్షు రెడ్డి తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా చీర్యాల గ్రామంలో జన్మించారు. అన్షు రెడ్డి వయసు 31 సంవత్సరాలు. ఈమె తండ్రి సుధాకర్ రెడ్డి, తల్లి వాణి. అన్షు రెడ్డి పదో తరగతి పూర్తియిన తర్వాత వాళ్ల కుటుంబం హైదరాబాద్‌కు ఫిష్ట్ అయింది. హైదరాబాద్‌లోనే దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ ఉమెన్‌లో ఆమె డిప్లొమా పూర్తి చేశారు. అన్షు రెడ్డికి చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఎక్కువ. స్టార్ మహిళా షోలో ఆమె పాల్గొనప్పుడు ఆమెకు సీరియల్‌లో నటించేందుకు ఛాన్స్ వచ్చింది.

కెరీర్ ప్రారంభం..
2014లో అన్షు రెడ్డికి ఈటీవీ ఛానెల్ నుంచి ఆఫర్ వచ్చింది. ‘భార్యామణి’ సీరియల్‌లో నటించేందుకు ఆఫర్ వచ్చింది. ఈ సీరియల్ అన్షు రెడ్డి కెరీర్‌నే మార్చేసింది. ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో ఆమెకు వరుస ఆఫర్లు రావడం మొదలయ్యాయి. గోకులంలో సీత, ఇద్దరమ్మాయిలతో, సూర్యవంశం, కథలో రాజకుమారి వంటి సీరియళ్లలో ఆమె నటించారు. కేవలం తెలుగులోనే కాదు తమిళ సీరియళ్లలోనూ ఆమె నటించారు.
https://www.instagram.com/_anshureddy/
సోషల్ మీడియాలోనూ యాక్టివే..
ఓ వైపు సీరియళ్లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు అన్షు రెడ్డి. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌తో కలిపి ఆమెకు లక్షల్లో ఫాలొవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 438కే ఫాలొవర్స్, యూట్యూబ్‌లో 75.2కే ఫాలొవర్స్ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో షార్ట్ వీడియోలు, ఆమె ఫోటోలను షేర్ చేస్తుంటారు. యూట్యూబ్‌లో ఆమె ట్రావెలింగ్, షాపింగ్, ఫ్యామిలీ వెకేషన్ వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.
https://www.youtube.com/@_anshureddy
అన్షు రెడ్డి ఇష్టాలు..
అన్షు రెడ్డి బిర్యానీ లవర్. హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అలాగే ట్రావెలింగ్, షాపింగ్ అంటే చాలా ఇష్టమట. షూటింగ్ గ్యాప్ వచ్చినప్పుడు ఫారన్ టూర్‌కు వెళ్లడం లేదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటారు. ప్రతి రోజు వ్యాయామం చేస్తుంటారని ఆమె చెప్పుకొచ్చారు. పుస్తకాలు చదవడం అలవాటట. అలాగే లేట్ నైట్స్ మూవీస్ చూడటం అంటే ఆమెకు ఇష్టమట.