ఆసీస్ ఆలౌట్ 151

మెల్ బోర్న్ టెస్ట్ లో ఆస్ట్రేలియా తొలిటెస్ట్ లె 151 పరుగులకే కుప్పకూలింది. భారత్ తొలి ఇన్నింగ్స్  కంటే 292 పరుగులు వెనుకబడింది. ఆసీస్ ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నా భారత్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది.భారత బౌలర్లలో బుమ్రా 6 వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచాడు. జడేజా రెండు వికెట్లు, ఇశాంత్ శర్మ ఒక వికెట్, మహ్మద్ షమీ 1 వికెట్ పడగొట్టారు.   భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్ల న‌ష్టానికి 443 ప‌రుగులు చేసి డిక్లేర్ చేసింది.. ఇక ఆసీస్ బ్యాటింగ్ లో హ‌రీస్ 22, ఖ్వాజా 21, మార్ష్ 19, హెడ్ 20, పెయిన్ 22, క‌మ్మిన్స్ 17 ప‌రుగులు చేయ‌గా, మిగిలిన బ్యాట్స్ మెన్ లు సింగిల్ డిజిట్ కు ప‌రిమిత‌మ‌య్యారు..