ఆస్ట్రేలియా టీ టైం స్కోర్ 145/7

Share

మెల్ బోర్న్ టెస్ట్ లో ఆస్ట్రేలియా కష్టాలు కొనసాగుతున్నాయి. తొలి సెషన్ లో నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా లంచ్ విరామం తరువాత నుంచి టీ విరామ సమయం మధ్యలో మరో మూడు వికెట్లు కోల్పోయింది.

టీ విరామ సమయానికి ఆసీస్ స్కోరు 145/7. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కన్నా ఆస్ట్రేలియా ఇంకా 298 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 443/7 వద్ద డిక్లెర్ చేసిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లలో బుమ్రా3, జడేజా 2, ఇశాంత్ శర్మ 1, మహ్మద్ షమి 1 వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఫాలో ఆన్ గండం దాటాలంటే ఇంకా 98 పరుగులు చేయాలి. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ టెస్ట్ పై భారత్ పట్టు బిగించింది. ఏదైనా అద్భుతం జరిగితేనో, వరుణుడు అడ్డం పడితేనో తప్ప ఈ టెస్ట్ లో భారత్ విజయం దాదాపు ఖాయమైంది.


Share

Related posts

బాలకృష్ణ బిబి3 నుంచి వచ్చిన అప్‌డేట్ తెలిస్తే పూనకాలతో డాన్సులే ..!

GRK

ఇలా చేస్తే మెరిసే పళ్ళు మీ సొంతం!!

Kumar

ఊహించిందే జరిగింది: కమల్

sarath

Leave a Comment