NewsOrbit
న్యూస్

యాక్సిస్ బ్యాంక్ కిసాన్ క్రెడిట్ కార్డు.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

దేశంలోని అనేక బ్యాంకులు రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డుల‌ను అందిస్తున్న విష‌యం విదిత‌మే. అయితే యాక్సిస్ బ్యాంక్ అందిస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అధిక వ‌డ్డీల‌కు అప్పులు తీసుకునే బ‌దులు ఈ కార్డును తీసుకుంటే దాంతో వ్య‌క్తిగ‌త అవ‌స‌రాలనే కాకుండా.. వ్య‌వ‌సాయ అవ‌స‌రాల‌ను కూడా తీర్చుకోవ‌చ్చు. ఇక యాక్సిస్ బ్యాంక్ కిసాన్ క్రెడిట్ కార్డును ఎలా తీసుకోవాలో, అందుకు ఎవ‌రు అర్హులో, వ‌డ్డీ రేట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

axis bank kisan credit card and its benefits how to apply interest rates

1. ప్రయోజ‌నాలు

యాక్సిస్ బ్యాంక్ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా గ‌రిష్టంగా రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు క్యాష్ లేదా ట‌ర్మ్ లోన్ తీసుకోవ‌చ్చు. ఆ మొత్తంతో వ్య‌వసాయ ప‌రిక‌రాలు, విత్త‌నాలు, ఇత‌ర యంత్రాలు కొన‌వ‌చ్చు. లేదా ఆ మొత్తాన్ని వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు. పంట చేతికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రుణ కాల వ్య‌వ‌ధి మొద‌ల‌వుతుంది. అవ‌స‌రం అనుకుంటే కాల‌వ్య‌వ‌ధిని ఎప్ప‌టిక‌ప్పుడు పెంచుకోవ‌చ్చు. క్యాష్ లోన్‌కు 1 ఏడాది వ‌ర‌కు కాల వ్య‌వ‌ధి ఉంటుంది. అదే ట‌ర్మ్ లోన్ అయితే రుణం మొత్తాన్ని 7 ఏళ్లలోగా చెల్లించాల్సి ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ కిసాన్ క్రెడిట్ కార్డును పొందాక కార్డు హోల్డ‌ర్‌కు రిలేష‌న్ షిప్ మేనేజ‌ర్‌ను ప్ర‌త్యేకంగా నియ‌మిస్తారు. అందువ‌ల్ల కార్డు హోల్డ‌ర్లు కార్డు వాడ‌కం, ఇత‌ర అంశాల‌పై త‌మ‌కు క‌లిగే సందేహాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నివృత్తి చేసుకోవ‌చ్చు. ఈ కార్డు పొందిన వారికి రూ.50వేల వ‌రకు యాక్సిడెంట‌ల్ ఇన్సూరెన్స్ ల‌భిస్తుంది.

2. అర్హ‌త

ఈ క్రెడిట్ కార్డును పొందాల‌నుకునే వారికి క‌నీస వ‌య‌స్సు 18 ఏళ్లు ఉండాలి. గ‌రిష్టంగా 75 ఏళ్ల వ‌ర‌కు వ‌య‌స్సు ఉండ‌వ‌చ్చు. లోన్ ముగిసే కాలం నాటికి 75 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగి ఉండాలి. 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు త‌మ‌క‌న్నా త‌క్కువ వ‌య‌స్సు ఉండే త‌మ కుటుంబ స‌భ్యులు లేదా ఇత‌రులెవ‌రినైనా కో బారోవ‌ర్‌గా ఎంచుకుని కార్డుకు అప్లై చేయాలి. దీంతో ఆ కో బారోవ‌ర్ కూడా క్రెడిట్ కార్డు రుణ చెల్లింపుల‌కు బాధ్యుడు అవుతాడు. ఇక జాయింట్ హోల్డింగ్ కింద ఒకేసారి 5 మంది క‌లిసి ఈ కార్డుకు అప్లై చేయ‌వ‌చ్చు. కార్డు అప్రూవ్ అయితే ఒక్కొక్క‌రికి ఒక్కో కార్డు ఇస్తారు. కానీ అకౌంట్ మాత్రం ఒక‌టే మెయింటెయిన్ అవుతుంది. అంద‌రూ క‌లిసి రుణం చెల్లించాలి.

3. వ‌డ్డీ రేట్లు

ఈ క్రెడిట్ కార్డును తీసుకునే వారికి రెండు ర‌కాలుగా వ‌డ్డీ రేట్లు విధిస్తారు. ప్రొడక్ష‌న్ క్రెడిట్ టైప్‌లో క‌నీస వ‌డ్డీ 8.85 శాతం నుంచి 13.10 శాతం వ‌ర‌కు ఉంటుంది. స‌గ‌టున 12.70 శాతం వ‌డ్డీ ప‌డుతుంది. అదే ఇన్వెస్ట్‌మెంట్ క్రెడిట్ టైప్ అయితే క‌నీస వ‌డ్డీ 8.85 శాతం నుంచి 14.10 శాతం వ‌ర‌కు ఉంటుంది. స‌గ‌టున వ‌డ్డీ 13.30 శాతం వ‌రకు ప‌డుతుంది.

4. అప్లై చేసే విధానం

యాక్సిస్ బ్యాంక్ కిసాన్ క్రెడిట్ కార్డుకు ఈ విధంగా అప్లై చేయ‌వ‌చ్చు.
* యాక్సిస్ బ్యాంక్ అధికారిక సైట్‌కు వెళ్లి అందులో అగ్రి అండ్ రూర‌ల్ ఆప్ష‌న్ ఎంచుకోవాలి.
* అనంత‌రం వచ్చే ఆప్ష‌న్‌లో లోన్స్‌ను ఎంచుకుని త‌రువాత వ‌చ్చే విభాగంలో కిసాన్ క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి.
* అనంత‌రం అప్లై నౌ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.
* త‌రువాత పేజీలో పేరు, చిరునామా, సిటీ, పిన్ కోడ్‌, ఈ-మెయిల్‌, రాష్ట్రం, స‌మీపంలోని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌, మొబైల్ నంబ‌ర్ వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయాలి.
* వివ‌రాల‌ను స‌బ్‌మిట్ చేశాక కాప్చా కోడ్ అడుగుతుంది. దాన్ని ఎంట‌ర్ చేసి స‌బ్‌మిట్ నొక్కాలి.
* యాక్సిస్ బ్యాంక్ నుంచి ప్ర‌తినిధులు కాల్ చేసి రైతుల వ‌ద్ద‌కు వ‌చ్చి వివ‌రాల‌ను వెరిఫై చేస్తారు. త‌రువాత కార్డును జారీ చేస్తారు.

author avatar
Srikanth A

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N