బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో హౌస్ లో గ్లామర్ తరహాలో కుర్రకారును బాగా ఆకట్టుకుంది కంటెస్టెంట్ మోనాల్. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు మూడు సినిమాలు చేయగా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిందో ఆమె తలరాత మారిపోయింది. హౌస్లో అభిజిత్, అఖిల్ తో సరదాగా ఉంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న తరహాలో హౌస్ లో వాతావరణం క్రియేట్ చేసింది.
సరిగ్గా టాప్ ఫైవ్ లో కి వెళ్లక ముందు హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. అయినాగానీ హౌస్ లో ఉన్నంత కాలం రోజురోజుకీ పరిణితి చెందుతూ ఓటింగ్లో సరికొత్త రికార్డులు కూడా క్రియేట్ చేయడం జరిగింది మోనాల్. ఇదిలా ఉండగా ప్రస్తుతం హౌస్ నుండి బయటకు వచ్చిన మోనాల్ ఓ ప్రముఖ డ్యాన్స్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇదే డాన్స్ షోలో జడ్జిగా రాణిస్తున్నారు బాబా భాస్కర్.
అయితే మోనాల్ కూడా జడ్జిగా రాణించిన క్రమంలో.. యాంకర్ ఓంకార్ మోనాల్ లో ఎలాంటి చేంజ్ వచ్చిందని ప్రశ్నించగా, జడ్జి సీటులో కూర్చున్న బాబా భాస్కర్ ఆమె కొద్దిగా స్లిమ్ అయ్యింది అంటూ సెటైర్లు వేయడం జరిగింది. మోనాల్ మాత్రం అటువంటిదేమీ లేదు ఎలా ఉన్నానో అలాగే ఉన్నా అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి మోనాల్ టెలివిజన్ రంగంలో మళ్లీ ఎంట్రీ ఇవ్వటంతో ఆమె కెరియర్ పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరో పక్క సినిమాలు కూడా చేయటానికి మోనాల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.