NewsOrbit
న్యూస్

Duplicate Spices: వంటల్లో వాడే సుగంధ ద్రవ్యాల కల్తీ ని ఇలా కని పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి!!

Best ways to Identify Duplicate Spices

Duplicate Spices: మన  వంటకాల్లో సుగంధ ద్రవ్యాలకుచాల  ప్రాధాన్యం ఉంది. ఇలాంటి పదార్థాల నాణ్యత, స్వచ్ఛతను సరిచూసిన తరువాతేకొనాలి . విడిగా లభించేవి కాకుండా, ప్యాంకింగ్ చేసిన నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే కొనాలి.సుగంధ ద్రవ్యాలకల్తీ కోసం  రంపపు పొట్టు, సింథటిక్ రంగులు, వంటి వాటిని వాడుతున్నారు.  ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఇలాంటి ఈ కల్తీని కనిపెట్టడానికి  కొన్ని మార్గాలు కూడా  ఉన్నాయి.

Best ways to Identify Duplicate Spices
Best ways to Identify Duplicate Spices

Duplicate Spices: ఇలా చేస్తే ఈజీ గా గుర్తించవచ్చు

ఒక టీ స్పూన్ పసుపును ఒక గ్లాసు నీటిలో కలపాలి . స్వచ్ఛమైన పసుపు కలిపిన నీరు అయితే  లేత పసుపు రంగులోకిమారతాయి. అది కల్తీ పసుపు  అయితే, నీరుముదురు  పసుపు రంగు  లోకి మారిపోతుంది.

మసాలా పొడుల కల్తీ కోసం  రంపపు పొట్టు ను వాడతారు. దీన్ని నీటిలో కలిపి పరీక్షించవచ్చు. ఒక గ్లాసులో నీరు తీసుకొని, దానిపై కాస్త మసాలా పొడి ని చల్లాలి. స్వచ్ఛమైన సుగంధ ద్రవ్యాలతో చేసిన పొడి ఐతే  నీటి అడుగు భాగానికి చేరుతుంది. రంపపు పొట్టు కలిపినది  అయితే అది నీటి పైన  తేలుతూ ఉంటుంది.

Best ways to Identify Duplicate Spices
Best ways to Identify Duplicate Spices

ఇంగువ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని కల్తీ చేయడానికి  చెట్ల నుంచి తీసే బంకను కలిపి కల్తీ చేసే అవకాశం ఎక్కువగా  ఉంది. దీన్ని తేలికగా  కానీ పెట్టవచ్చు. ఒక స్టీల్ చెంచాలో కొంచెం ఇంగువ తీసుకొని నిప్పంటించాలి. స్వచ్ఛమైన ఇంగువ ఐతే  కర్పూరంలా పూర్తిగా కాలిపోతుంది. ఒకవేళ కల్తీ ఇంగువ అయితే, నిప్పు వెలిగించినప్పుడు ప్రకాశవంతమైన మంట రాదు.

కారంలో కొన్ని రకాల సింథటిక్ రంగులు కలిపి కల్తీ కి పాల్పడుతూ ఉంటారు. దీన్ని చాల తేలికగా గుర్తించ వచ్చు. ఒక గ్లాసులో నీరు తీసుకొని, నీటి పై  కొంచెం కారం వేయాలి. దాంట్లో కృత్రిమ రంగులు ఉంటే అవి  నీటిలో కలిసిపోయి నీటి  రంగు మారుతుంది. స్వచ్ఛమైన కారం ఐతే  నీటిలో పూర్తిగా కరిగిపోదు.

సాధ్యమైనంత వరకు వీటిని విడిగా కాకుండా, FSSAI(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ధ్రువీకరణ ఉన్న కంపెనీలవి మాత్రమే  కొని వాడాలి.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju