Prabhas : సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో ఇట్టే కలిసిపోయే వ్యక్తిత్వం కలిగిన టాప్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
చాలామంది ఇండస్ట్రీలో ప్రభాస్ తో పని చేసిన వారు ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ప్రభాస్ మర్యాద ఇస్తాడని చెబుతారు. అంతేకాకుండా తనకు నచ్చితే సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇస్తారని ఇండస్ట్రీలో టాక్ ఎప్పటి నుండో ఉంది. ఈ విధంగానే ఇటీవల “రాధేశ్యాం” సినిమా యూనిట్ కి బహుమతులు కూడా ప్రభాస్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ సినిమా యూనిట్ ఎంపికచేయడం జరిగింది. ఫస్ట్ టైం ప్రభాస్ సరసన ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న నేపథ్యంలో సలార్ పై ప్రత్యేకమైన శ్రద్ధ ఏర్పడింది. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ వెల్లడించింది. సరిగ్గా శృతి హాసన్ బర్త్ డే నాడు ఈ విషయాన్ని వెల్లడించడంతో ఈ విషయం తెలుసుకుని ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్రలో విజయ్ సేతుపతి ని తీసుకోవడానికి ప్రశాంత్ నీల్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే టాక్ వినపడుతోంది. ముఖ్యంగా మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి నటించిన విలన్ పాత్ర చూసి ప్రశాంత్ నీల్ ఫిదా అయినట్లు.. దీంతో సలార్ లో తీసుకోవాలని డిసైడ్ అయినట్లు ఫిలిం వర్గాలలో సరికొత్త టాక్ వినపడుతోంది. ముఖ్యంగా తమిళంలో హీరోగా స్టార్ డాం ఉండటంతోపాటు తెలుగులో విలన్ క్రేజ్ ఉండటంతో ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు ఫస్ట్ ఫైట్ సీన్ చిత్రీకరించే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో విజయ్ సేతుపతి సినిమాలో విలన్ లో కనిపిస్తారో లేదో చూడాలి.