బీఎఫ్ డబ్ల్యు ఫైనల్ విజేత సింధు

బీఎఫ్ డబ్ల్యు టైటిల్ ను తెలుగుతేజం, భారత ఏస్ షట్లర్ పీవీ సింధు కైవసం చేసుకుంది. ఈ రోజిక్కడ జపాన్ షట్లర్ ఒకుహరతో ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ లో సింధు వరుస గేమ్ లలో విజయం సాధించి టైటిల్ దక్కించుకుంది. తొలి గేమ్ ను 21-19 తేడాతో గెలిచిన సింధు, రెండో గేమ్ ను 21-17తో గెలుచుకుని టైటిల్ విజేతగా నిలిచింది.

ఈ విజయంతో గత ఓటమికి సింధు ప్రతీకారం తీసుకున్నట్లైంది. ఈ టోర్నీలో సింధు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా విజయాలు సాధించడం విశేషం. సెమీస్ లో విజయం తరువాత సింధు మాట్లాడుతూ టైటిల్ సాధిస్తానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన సంగతి విదితమే.

భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో బీఎఫ్ డబ్ల్యు టోర్నీ టైలిట్ గెలిచిన ఏకైక షట్లర్ సింధూయే. ఇంత వరకూ భారత షట్లర్లలో ఎవరూ అందుకోని ఈ ఘనత సింధూకే దక్కింది.   ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కు దూసుకెళ్లిన సింధు రెండో ప్రయత్నంలో టైటిల్ దక్కించుకుని చరిత్ర సృష్టించింది.