Bigg Boss 5 Telugu: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఎదురు చూస్తున్న షో బిగ్ బాస్ ప్రారంభం అయిపోయింది. ఈ క్రమంలో షో లో మొట్టమొదటి రోజే టాస్క్ లు ఇవ్వటం మాత్రమే కాక… ఇంటి లోని సభ్యులను బిగ్ బాస్ మొట్టమొదటి రోజే ఆటాడుకున్నారు. దాదాపు 19 మంది కంటెస్టెంట్ లు ఫస్ట్ డే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. నాగార్జున వీరందరినీ సాదరంగా ఆహ్వానించి.. హౌస్ లోకి ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు.. ఏం ప్లాన్ చేశారు ఇలా రకరకాలుగా వారిని ప్రశ్నలు వేయడం జరిగింది. లోపలికి వెళ్ళిన వారిలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలు యూట్యూబ్ స్టార్లు.. టాప్ యాంకర్ లు.. అదే రీతిలో సినిమా ఇండస్ట్రీ లో పేరుగాంచిన నటీనటులు ఉన్నారు.
వీరిలో యాంకర్ రవి కూడా కీలక కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టడం జరిగింది. పరిస్థితి ఇలా ఉన్న తరుణంలో .. గత సీజన్ కంటెస్టెంట్ టాప్ త్రీ బిగ్ బాస్ స్టార్.. ఫైర్ మాన్ సోహెల్ పై యాంకర్ రవి హౌస్ లో ఎంట్రీ ఇస్తూ సెటైర్లు వేశారు. విషయంలోకి వెళితే యాంకర్ రవి హౌస్ లో అడుగు పెట్టక ముందు నాగార్జున కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో హౌస్ లో తాను కోపం పడకూడదు అని అనుకుంటున్నట్లు.. గత సీజన్ నెంబర్ సోహెల్ మాదిరి నరాలు ఏసుకుని.. ఇతరులపై అరవకుండా.. సైలెంట్ గా గేమ్ ఆడాలని కథ వేరేది హౌస్ లో అందరికీ చూపించాలని.. ట్రూ గా గేమ్ ఆడాలన్న ఉద్దేశంతో హౌస్ లో అడిగి పెడుతున్నట్లు.. యాంకర్ రవి కాకుండా రియల్ రవిని ప్రేక్షకులకు చూపించడానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశాడు.