సీజన్ ఫోర్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ అభిజిత్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో అక్కడ అలా మాట్లాడుతూ అభిజిత్ ఆడే గేమ్ చాలా మందిని ఆకట్టుకుంటుంది. ఏ విషయంలో కూడా బయటపడకుండా భావోద్వేగాలను తనలోనే ఉంచుకుంటూ వేరే వాళ్ళకి తనపై ఛాన్స్ వచ్చే అవకాశం ఇవ్వకుండా ఇప్పటివరకు రాణించాడు.
పరిస్థితి ఇలా ఉండగా తాజాగా హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కి అభిజిత్ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. మేటర్ ఏమిటంటే గతంలో మోనాల్‌ని అభిజిత్, అఖిల్ బాగా ఏడ్పించారని, అందుకే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆమెతో డేట్‌కు వెళ్లాలని ఫిటింగ్ పెట్టాడు బిగ్‌బాస్. దానికోసం మీ ఇద్దరికీ క్విజ్ కాంపిటేషన్ పెట్టబడుతుందని.. దానిలో గెలిచిన వాళ్లు డేట్‌కి వెళ్తారని బిగ్ బాస్ లెటర్ పంపించడంతో అభిజిత్ తీవ్రస్థాయిలో సీరియస్ అవుతాడు.
అసలు మోనాల్‌తో నాకు ఎటువంటి లింక్ పెట్టకండి అంటూ పదేపదే చెబుతున్న..మళ్లీ డేట్ ఏంటి? నేను తనని ఏడిపించడం ఏంటి? నాకు అసలు ఈ టాస్క్ వద్దు.. ఈ టాస్క్‌కి నేను ఒప్పుకుంటే నేను ఆమెను ఏడిపించానని ఒప్పుకున్నట్టు బయట ప్రోజెక్ట్ అవుతుందని నేను ఈ టాస్క్ ఆడను అంటూ బాగా ఎమోషనల్ అయిపోయాడు. దీంతో వెంటనే పక్కనే ఉన్న హారిక అతన్ని గట్టిగా ఓదార్చింది. ఇదే క్రమంలో నాకు ఈ టాస్క్ వద్దు బిగ్ బాస్’ అంటూ ఎమోషనల్ అవుతూ అభిజిత్ డ్రాప్ అయ్యాడు. వెంటనే బిగ్ బాస్ ఈ టాస్క్ ని కంప్లీట్ చేయాలని అఖిల్ కి తెలిపారు.