ఆ సమయం వచ్చేసింది. బిగ్ బాస్ షో ప్రారంభం అయిపోయింది. శనివారమే షూటింగ్ కూడా పూర్తయిపోయింది. ఆదివారం సాయంత్రం 6 న మొదటి ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయనున్నారు. దానికి సంబంధించిన టీజర్ ను కూడా మాటీవీ యాజమాన్యం రిలీజ్ చేసింది.
కంటెస్టెంట్లు ఇప్పటికే హౌస్ లోకి వెళ్లిపోయారు. ఒకరినొకరు పరిచయాలు పెంచుకొని ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ రూల్స్ ను ఫాలో అవుతున్నారు.
మాస్కులు ముఖానికి మాత్రమే అవసరం కానీ.. ఎంటర్ టైన్ మెంట్ కు కాదు.. అంటూ హోస్ట్ నాగార్జున ప్రీమియర్ టీజర్ లో చెప్పడం చూస్తుంటే బిగ్ బాస్ ఈసారి డోస్ పెంచి మరీ వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాడని అర్థం అవుతోంది.
అయితే.. తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఒకే ఒక టెన్షన్… కంటెస్టెంట్లు ఎవరు అని. ఎవరై ఉంటారు.. అన్న టెన్షన్ ను తట్టుకోలేకపోతున్నారు. నిజానికి కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో ఎప్పుడో వైరల్ అయినా కూడా వాళ్లే ఫైనలా? లేక వేరేవాళ్లను తీసుకుంటున్నారా? అన్న సందిగ్ధం నెలకొన్నది.
అయితే.. ఇదివరకు సోషల్ మీడియాలో వైరల్ అయిన లిస్టుతో పాటు ప్రస్తుతం మరికొన్ని కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఇక.. ఇదే ఫైనల్ లిస్టు. ఇప్పటికే ఇంట్లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీళ్లే అంటూ మరో లిస్టు ప్రచారంలో ఉంది.
కొత్తగా వినిపిస్తున్న పేర్లలో అభిజిత్ ఒకరు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో హీరోగా నటించిన అభిజిత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడట. ఈ అభిజిత్ ఎవరో కాదు.. హీరో అఖిల్ క్లాస్ మేట్. వీళ్లిద్దరు కలిసి చైతన్య విద్యాలయంలో చదువుకున్నారు. అలా.. వాళ్లిద్దరికీ ఫ్రెండ్ షిప్ కుదిరింది.
ఇక.. అభిజిత్ కాకుండా మిగితా కంటెస్టెంట్లు టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, యాంకర్ లాస్య, జబర్దస్త్ ముక్కు అవినాశ్, యూట్యూబర్ గంగవ్వ, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్, సింగర్ నోయల్, హీరోయిన్ మొనాల్ గజ్జర్, దేత్తడి హారిక, యాంకర్ అరియానా గ్లోరీ, ముద్దమందారం ఫేమ్ తనూజా పుట్టస్వామి, సయ్యద్ సొహైల్, యూట్యూబర్ మెహబూబా దిల్ సే, కరాటే కళ్యాణి, డైరెక్టర్ సూర్య కిరణ్.