బిగ్ బాస్ 4: బిగ్ ట్విస్ట్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ కంటెస్టెంట్..!!

Share

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 10 మంది సభ్యులు ఉన్నారు. బుధవారం ఆట ముగింపుతోనే 11వ వారం లోకి అడుగుపెట్టనుంది. హౌస్ లో ఇంటి సభ్యుల మధ్య వాతావరణం నువ్వానేనా అన్నట్టుగా ఉంది. సీక్రెట్ రూమ్ నుండి ఇంటిలోకి అఖిల్ ఎంట్రీ ఇవ్వటంతో పాటు కెప్టెన్ అవ్వటంతో అయోమయంలో ఇంటి సభ్యులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఇలాంటి షాక్ లోనే ఇంటి సభ్యులకు మరో బిగ్ ట్విస్ట్ ఇవ్వడానికి బిగ్ బాస్ రెడీ అవుతున్నట్లు టాక్.

Bigg Boss Telugu 4: Kumar Sai Pampana reveals why he signed up for the show  - Times of Indiaపూర్తి విషయంలోకి వెళితే వైల్డ్ కార్డ్ రూపంలో హౌస్ లో అడుగుపెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ కుమార్ సాయిని తిరిగి హౌస్ లోకి పంపించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి కుమార్ సాయి ఎలిమినేషన్ విషయంలో ఓటింగ్ పై బిగ్ బాస్ షో నిర్వాహకుల పై అప్పట్లో విమర్శలు భారీస్థాయిలో వచ్చాయి.

 

పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల బిగ్ బాస్ షో నిర్వాహకులు చివరిలో ఒకరు రీఎంట్రీ కన్ఫామ్ కావాలని… కుమార్ సాయిని మంగళవారం జరగబోయే ఎపిసోడ్ లో ఇంటిలోకి పంపించడానికి షో నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సీజన్లో రీ ఎంట్రీ లో అలీ రెజా ఏ విధంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చాడో అదేరీతిలో కుమార్ సాయి ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఎలిమినేషన్ అయిన తర్వాత కూడా తనకి హౌస్ లో న్యాయం జరగలేదని పలు ఇంటర్వ్యూలలో కుమార్ సాయి తెలపటంతో.. ఓటింగ్ విషయంలో కూడా కాంట్రవర్సీ కామెంట్ లు చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో సోమవారం నామినేషన్ ఎపిసోడ్ అయిన తర్వాత రోజు కుమార్ సాయి చేత హౌస్ లోకి రీ ఎంట్రీ ఇప్పించే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.


Share

Related posts

RGV’s Powerstar Movie New Photos

Gallery Desk

వైసిపికి గౌరు దంపతులు గుడ్‌బై

somaraju sharma

Rashmika mandanna: తన చుట్టుపక్కల ఆ విధంగా చేస్తే చాలా చిరాకు పడుతుందట రష్మిక మందన..??

sekhar