Avinash and Ariyana : బిగ్ బాస్ అవినాష్, అరియానా Avinash and Ariyana గురించి తెలుసు కదా. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య ఒక బంధం ఏర్పడింది. అది ఫ్రెండ్ షిప్పా.. లేక ఇంకోటా అనేది వాళ్లకే తెలియాలి కానీ.. వాళ్లిద్దరు మాత్రం చాలా క్లోజ్. అవినాష్ లేకుండా అరియానా ఉండలేదు.. అరియానా లేకుండా అవినాష్ ఉండలేడు. ఇద్దరి మధ్య అంత క్లోజ్ నెస్ ఏర్పడే సరికి.. అందరూ వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనుకుంటన్నారు. నిజానికి.. అవినాష్, అరియానా.. ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా అలాగే ఉంటోంది.

Avinash and Ariyana : అవినాష్, అరియానా.. ఇద్దరూ కలిసి చాలా ప్రోగ్రామ్స్ లో నటిస్తున్నారు
కామెడీ స్టార్స్ కామెడీ ప్రోగ్రామ్ లో అవినాష్ స్కిట్ లో అరియానా నటించడం.. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం.. డ్యాన్స్ ను ఇరగదీయడం.. ఇవన్నీ చూస్తుంటే.. ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఉంది అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలుగుతోంది.
ప్రేక్షకులకే కాదు.. నెటిజన్లు కూడా దీనిపైనే చర్చిస్తున్నారు. అసలు.. వీళ్లు ఫ్రెండ్సా లేక ఇంకేమన్ననా. ఏ స్టేజ్ మీద ఉన్నా వీళ్ల రొమాన్స్ మామూలుగా ఉండటం లేదు… రెచ్చిపోతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే.. వీళ్లదంతా ఉత్తుత్తి రొమాన్సేనంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు. ప్రేక్షకులను తమ షోల వైపునకు తిప్పుకునేందుకు కావాలని షో యాజమాన్యం.. ఇలాంటి ట్రిక్స్ ను ప్లే చేస్తుందని అంటున్నారు.
ఏమో.. దాన్ని వీళ్లిద్దరు అడ్వాంటేజ్ గా తీసుకున్నట్టు అనిపిస్తుంది.. అంటూ మరికొందరు వాదిస్తున్నారు. తాజాగా.. అవినాష్.. ఇద్దరమ్మాయిలతో అనే ఓ వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో విడుదల చేశాడు.
ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వాళ్ల రొమాన్స్ ను చూసేయండి మరి.