Bigg boss Harika : బిగ్ బాస్ హారిక గురించి తెలుసు కదా. తను ఇచ్చిపడేస్తది. తను చాలా స్ట్రయిట్ ఫార్వార్డ్. చాలా స్మార్ట్ కూడా. బిగ్ బాస్ కు రాకముందే తను దేత్తడి అనే యూట్యూబ్ చానెల్ ద్వారా ఫుల్ టు ఫేమస్ అయింది. సోషల్ మీడియా స్టార్ అయింది. కానీ… బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాక తన రేంజే మారిపోయింది. ప్రస్తుతం తను ఒక సెలబ్రిటీ. మామూలు సెలబ్రిటీ కాదు. తనకు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉంది. వెబ్ సిరీస్ ల కోసం, సినిమాల కోసం, టీవీ షోల కోసం తనకు ఫుల్లు ఆఫర్లు వస్తున్నాయి. అయినప్పటికీ తను ఆచీ తూచీ అడుగేస్తోంది.

ఇక… బిగ్ బాస్ హౌస్ లో తనకు ఇష్టమైన వాళ్లంటే ముందు నోయల్ సేన్ ఆ తర్వాత అభిజీత్. నోయల్ తో హారిక చాలా క్లోజ్ గా ఉంటుంది. నోయల్ హౌస్ నుంచి వెళ్లిపోయినప్పుడు కూడా చాలా రోజులు ఏడ్చింది.
Bigg boss Harika : నోయల్ సేన్ తో కలిసి ఇచ్చిపాడ్ అనే ఆల్బమ్ లో నటించిన హారిక
తాజాగా నోయల్ సేన్ తో కలిసి బిగ్ బాస్ హారిక… ఇచ్చిపాడ్ అనే ఆల్బమ్ లో నటించింది. నోయల్ రాప్ సింగర్ అని అందరికీ తెలుసు కదా. ఇచ్చిపాడ్ కూడా రాప్ సాంగే అయి ఉంటుంది. ఇచ్చిపాడ్ రాప్ సాంగ్ లో నోయల్ సేన్, హారిక స్టయిల్ మాత్రం అదుర్స్.
ఈనెల 9 వ తారీఖున ఫుల్ సాంగ్ విడుదల కానుంది. అప్పటి వరకు ఇచ్చిపాడ్ ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.