Two Feet Tallman : తనకు పెళ్లి చేయాలంటూ సీఎం కి లేఖ రాసిన ఈ యువకుడి కథ చదవాల్సిందే..

Share

Two Feet Tallman : అజీమ్ మన్సూరి.. వయస్సు 26 ఏళ్లు.. ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. వస్త్ర వ్యాపారం చేస్తూ బాగా సంపాదించాడు. సొంత ఇల్లు ఉంది. బంధువులు, బలగం కూడా బాగానే ఉన్నారు. కానీ ఈ సమస్య ఏమిటంటే పెళ్లి కావడం లేదు.. ఐదు సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు చూస్తున్న అతనికి పెళ్లి సంబంధం కుదరలేదు. కారణం.. అతడి ఎత్తు 2.5 అడుగులు.. అతడో మరగుజ్జు.. ఆ మధ్య యూపీ పోలీసులకు తన గోడు చెప్పుకొని పెళ్లి కూతురిని పెట్టి పెళ్లి చేయమంటూ పోలీసులను విన్నవించుకున్నాడు.. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతే అజీం ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు.. పోలీస్ స్టేషన్ కి వెళ్లి వచ్చాక. అతడి ఫేట్ మారిపోయింది. తన సుదీర్ఘ నిరీక్షణ ఫలించడంతో ఆనందంలో మునిగి తేలుతున్నాడు..

Two Feet Tallman : write a letter to CM
Two Feet Tallman : write a letter to CM

2019లో అప్పటి యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ కు తనకి పెళ్లి చేయాలంటూ లేఖ కూడా రాశాడు.. ఆ తరువాత కొన్ని రోజుల క్రితం తనకు పెళ్లి కూతురు ని వెతికి పెట్టి వెళ్లి చేయాలంటూ పోలీసుల గడ్డం పట్టుకుని వేడుకొన్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇప్పుడు పెళ్లి సంబంధాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.. తన సుదీర్ఘ నిరీక్షణ ఫలించడంతో అజీమ్ ఆనందానికి అవధులు లేవు. పలు పెళ్లి సంబంధాలు రాగా అందులో చెందిన 25 ఏళ్ల రెహనా మనోడికి బాగా నచ్చిందట. ఢిల్లీ నుంచి మరో యువతి నువ్వు సింగిల్ నేను సింగిల్.. మింగిల్ అవుదామా అని అడిగిందట.. సహారా పూర్,మొహరబాద్ నగరాల నుంచి సంబంధాలు వస్తున్నాయని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇదంతా దేవుడు దయ అని. త్వరలోనే పెళ్లి అవుతుందని ఆనందంగా చెప్పాడు అజీమ్. పెళ్లిచూపులు జరిగిన ప్రతిసారి తీవ్ర మనోవేదన ఎదుర్కొన్నాడు. మొత్తంగా ఈ మరుగుజ్జు కి మంచి రోజులు వచ్చినట్లే..


Share

Related posts

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఎక్కడ?

Mahesh

అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం..!!

sekhar

హైదరాబాద్ లో కరోనా ట్రీట్మెంట్ 28 వేలే… ఎక్కడో తెలుసా?

sekhar