NewsOrbit
జాతీయం న్యూస్

Bihar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా .. సాయంత్రం కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం

Bihar: బీహార్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే మహాకూటమి నుండి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దమైయ్యారు సీఎం నితీశ్ కుమార్.  ఈ క్రమంలో భాగంగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. మహాకూటమితో సంబంధాలు తెంచుకున్నట్లు తెలిపి బీజేపీతో జతకట్టేందుకు సిద్దమైనట్లు తెలిపారు.

నితీశ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగ కొనసాగాలని కోరారు. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్  ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ .. సీఎం పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ ను కోరినట్లుగా చెప్పారు.

అన్ని వర్గాల సూచనలు పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవు అని వ్యాఖ్యానించారు. నేతల వైఖరి సరిగా లేనందున చాలా మంది ఇబ్బంది పడ్డారన్నారు. మహాకూటమితో సంబంధాలు తెంచుకోవాలని నిర్ణయించామని నితీశ్ కుమార్ పేర్కొన్నారు. అంతకు ముందు నితిశ్ కుమార్ నివాసంలో జేడీయూ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు హజరైయ్యారు.

ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతిపాదనకు బీజేపీ, జేడీయూ సహా ఇతర మిత్ర పక్షాల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరిని లెజిస్లేటివ్ పార్టీ నేతగా, విజయ్ సిన్హాను డిప్యూటి లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నుకున్నారు.

మరో వైపు నితీశ్ కుమార్ రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్ స్పందించింది. నితీశ్ ను ఊసరవెల్లితో పోల్చింది. ఆయన చేసిన ద్రోహాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని, నితీశ్ చేసిన పనిని తప్పుబట్టింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర కు ప్రధాని మోడీ, బీజేపీ భయపడ్డాయని, అందుకే ఆ యాత్ర నుండి దృష్టి మళ్లించడానికి ఈ నాటకానికి తెరలేపాయని కాంగ్రెస్ ఆరోపించింది.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీనిపై స్పందిస్తూ ఇలా జరుగుతుందని లాలూ ప్రసాద్ యాదవ్ ఇది వరకే హింట్ ఇచ్చారని చెప్పారు. అదే ఈ రోజు నిజమైందని అన్నారు. ఇలాంటి వ్యక్తులు దేశంలో చాలా మంది ఉంటారని అన్నారు.

Galla Jayadev: టీడీపీకి బిగ్ షాక్ .. అజ్ఞాతవాసంకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N