Srimukhi: బుల్లితెర పై రాములమ్మ గా పాపులర్ అయ్యింది యాంకర్ శ్రీముఖి. పాపులారిటీకి క్యారోఫ్ అడ్రస్ గా నిలిచింది. ఈమె కెరీర్ మొదట్లో అడపా దడపా యాంకరింగ్ చేసినప్పటికీ ప్రస్తుతం మాత్రం ప్రతి ఒక్క షో కి యాంకరింగ్ చేస్తూ దూసుకుపోతుంది.
ఇక మరో పక్క సినిమాలలో హీరోలకి చెల్లెలి పాత్ర వంటివి చేస్తూ తన సత్తా చాటుకుంటుంది. ఇక ఈమె ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్ కి కూడా ఉండదని చెప్పవచ్చు. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఓ స్టార్ హీరో, ఈమె దగ్గరికి వచ్చి తన సినిమాలో ఆఫర్ ఇస్తే ఈమె కాలితో తన్నిందట.
దానికి కారణం ఈమె ఆ హీరో కి డై హార్డ్ ఫ్యాన్ కావడమే అట. ఇక ఆ హీరో మరెవ్వరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ హీరోగా నటించిన ” మిస్టర్ పర్ఫెక్ట్ ” సినిమాలో డార్లింగ్ కి చెల్లెలుగా శ్రీముఖిని అనుకున్నారట మేకర్స్. ఇక ప్రభాస్ సైతం ఈమెకి ఆఫర్ ఇవ్వాలని ఓకే చెప్పాడట. కానీ శ్రీముఖి ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. అంతేకాకుండా..” నేను ప్రభాస్ కి డై హార్డ్ ఫ్యాన్.
ఆయనకి చెల్లెలిగా నా జీవితంలో నటించను. ఇంకే పాత్రైనా చేస్తాను కానీ ఈ ఒక్క పాత్ర మాత్రం నేను చెయ్యను ” అని ఓ పెద్ద కొటేషనే చెప్పిందట. ఇక దీంతో మేకర్స్ అక్కడ నుంచి వెళ్లిపోయారట. ఇక ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ న్యూస్ విన్న ప్రేక్షకులు..” ప్రభాస్ అంటే ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంటుంది మరి. డార్లింగా మజాకానా ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.