NewsOrbit
Featured న్యూస్

తల్లి పాల కోసం యాంత్రిక పరికరం…!

 

 

తల్లి పాలు శిశువుకి అమృతం వంటివి. తల్లి పాలివ్వడం అనేది తల్లి జీవితంలో సంతోషకరమైన అనుభవాలలో ఒకటి. ఇది శిశువుకు పూర్తి పోషణను అందించడమే కాక, పిల్లలకి మరియు తల్లికి మధ్య విడదీయరాని బంధాన్ని ఏర్పరుస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల బిడ్డలు తల్లికి దూరం అవుతుంటారు, అలంటి పిల్లలకి తల్లి పాలు అనేవి అందవు. ఇంకా కొన్ని సందర్భాలలో తల్లి తన బిడ్డకి కూడా పాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటది. ఇలాంటి సమస్యలకి పరిష్కారంగా రొమ్ము పంపు అన్నే ఒక్క పరికరం అందుబాటులో ఉంది.

 

breast pump

పాలు ఇవ్వడంలో ఇబ్బందులు:
ప్రీ మెచ్యూర్ గా బేబీ పుట్టిన సమయంలో బిడ్డను ఇంక్యూబేటర్ లో పెడతారు, ఆ సమయంలో తల్లి బిడ్డకు దూరం అవడం వల్ల పాలు ఇవ్వలేని పరిస్థి ఉంటది. మరొకటి శిశువు పాలు తాగుతున్న సమయంలో తల్లి స్తనాలు కొరకడం వల్ల తల్లికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది తల్లికి భరించలేని నొప్పిని కలిగించడమే కాక, శిశువు మళ్ళీ కొరుకుతారేమోనని అనుకుంటుంది, ఈ భయం కారణంగా, తల్లి పాలిచ్చేటప్పుడు తల్లి భయపడటం ప్రారంభిస్తుంది. ఈ భయం తల్లి పాలివ్వడంలో తల్లి ఆనందాన్ని తగ్గిస్తుంది. ఇంకొక సమస్య ఉద్యోగం చేసే తల్లులు ఆఫీస్ కి వెళ్లాల్సిన పరిస్థి లో కూడా శిశువు లు చనుబాలు కి దూరం అవుతారు. తాజా పరిస్థితులలో కరోనా మహమ్మారి దృష్ట్యా తల్లి కి వైరస్ సోకితే బిడ్డ నుండి దూరం అవ్వాల్సిన పరిస్థి ఉంది. వీటి అన్నిటికి పరిష్కారమే ఈ రొమ్ము పంపు.

 

breast pump

రొమ్ము పంపు అంటే:
రొమ్ము పంపు అంటే పాలిచ్చే మహిళ రొమ్ముల నుండి పాలను సేకరించే ఒక యాంత్రిక పరికరం. దీన్ని ద్వారా మహిళలు తమ స్థానాల నుండి పాలను సేకరించి. బాటిల్ లలో పోసి ఫ్రిడ్జ్ లో భద్ర పరుచుకోవచ్చు. దీని వల్ల తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్సెస్ గా వృధా అయ్యే పాలను ఈ పంపు ద్వారా సేకరించి స్టోర్ చేసుకోవచ్చు. దీనిలో మాన్యువల్ గా పని చేసి రొమ్ము పంపు, అలానే ఛార్జింగ్ తో పని చేసేవి ఉన్నాయి.

ఎలా ఉపయోగించాలి:
తల్లిపాలు స్తనాలనుండి బయటకు తీయటానికి నిర్దేశించిన పంపును స్తనంపై ఉంచాలి. చనుమొనలను ఖచ్చితంగా పంపు మధ్యభాగంలోకి ఒత్తి పెట్టాలి.ఆ తరువాత స్విచ్ ఆన్ చేసి. పంపు నెమ్మదిగా, తక్కువ స్ధాయిలో పని చేసేలా చూసుకోవాలి. పంపు స్తనాలనుండి ఒత్తిడితో అధికంగా పీల్చరాదు. 15 నిమిషాలపాటు ఈ ప్రక్రియను చేయవచ్చు. ఈ పదిహేను నిమిషాలలోను, ఏడు నిమిషాల తర్వాత ఒకసారి పంపును తొలగించి స్తనాన్ని మర్దన చేసి రెండవ మారు మరల 7 నిమిషాలు పాలు తీయాలి.

Breast_Pump_Milk storage

పాలు ఎలా నిలువ చేయాలి?
పంపుతో బయటకు తీసిన తల్లిపాలను సాధారణ ఉష్ణోగ్రతలో బయట 5 నుండి 7 గంటలు లేదా రిఫ్రిజిరేటర్ లో అయితే 5 నుండి 7 రోజులపాటు నిల్వవుంచవచ్చు. ఫ్రిజ్ లో పాలు గడ్డకట్టినప్పటికి, వాటిని వేడి నీటిలో లేదా ఒక వేడి గిన్నెలో పెట్టి సాధారణ స్ధితికి తెచ్చి, బేబీ పాలు త్రాగే బాటిల్ లోకి పోయవచ్చు. గడ్డకట్టిన పాలను మైక్రోవేవ్ లలో వుంచకండి. పోషక పదార్ధాలు తొలగి బిడ్డ నోరు కాలే ప్రమాదం వుంది. పాలను పంపుతో తీయటానికి ఉదయం 1 గం. నుండి 5 గంటలవరకు మంచి సమయం.

మహమ్మారి సమయం లో రొమ్ము పంపు ఉపయోగం:
కరోనా సోకిన తల్లి శిశువులకు పాలు పట్టడం ప్రమాద కారకం కాదు. నిజానికి, తల్లి పాలు ఉత్తమ పోషక పదార్ధాలలో ఒకటి. ప్రతిరోధకాలు మాత్రమే కాదు, అవి కోవిద్-19 కు వ్యతిరేకంగా ఏర్పడటానికి ముందుగానే ఉండవచ్చు. ఇది గర్భధారణ సమయంలో శిశువుకు చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. కాబట్టి నిజం ఏమిటంటే తల్లి పాలివ్వడం వల్ల చాలా సమస్యలు రావు. కానీ తల్లి గమనించనప్పుడు, శిశువుకు వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయం లో పాలిచ్చే తల్లులు రొమ్ము పంపును ఉపయోగించడం శిశువుకి చాలా మంచిది. పాలు తీసుకున్న తర్వాత బాటిల్స్ లో నింపి బిడ్డకు తాపించవచ్చు. కానీ మళ్ళీ ఆ బాటిల్స్ కానీ, బ్రెస్ట్ పంప్స్ కానీ ఉపయోగించేటప్పుడు వాటిని శుభ్రంగా కడగాలి. తగిని రక్షణ జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే వైరస్ కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు ఎక్కడైనా జీవించగలదు. అందువల్ల, మీరు బిడ్డలకు కోసం ఉపయోగించి అన్ని వస్తువులను , ఫీడింగ్ బాటిల్స్, గిన్నెలు , ప్లేట్స్ శుభ్రపరచడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే, ఇది మరింత ప్రమాదాలకు దారితీస్తుంది.

తమ బిడ్డలకే కాకుండా, తల్లులకి దూరం అయినా పసికందులకి కూడా తాము రొమ్ము పంపు ద్వారా స్టోర్ చేసిన ఎక్సెస్ అఫ్ మిల్క్ ని డొనేట్ చేయవచ్చు. దీనికోసం కొన్ని ఆసుపత్రిలలో మిల్క్ బ్యాంకు లు సైతం అందుబాటులో ఉన్నాయి. రక్తం దానం చేసి ప్రాణాలని ఎలా కాపాడుతామో , తల్లులు తమ దగ్గర ఉన్న ఎక్సెస్ అఫ్ మిల్క్ ని దానం చేసి తల్లి పాలకి దూరం అయినా శిశువుల కి వజ్ర సమానమైన రోగ నిరోధిక శక్తిని అందించవచ్చు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N