NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ వైస్సార్సీపీ నేతలకు జైలు తప్పదా? సిబిఐ దర్యాప్తు మొదలు

 

 

కోర్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసుని సిబిఐ పరుగులు పెట్టిస్తోంది. హై కోర్టు ఆదేశాల మేరకు సిఐడి నుంచి కేసు స్వీకరించిన సిబిఐ దానిలో ఉన్న అంశాలను విభాగాలుగా పరిశీలిస్తుంది. కోర్టు సూచనల మేరకు ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా కోర్టులను ఇష్టానుసారం నిందించి, అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టి వాటిని సర్క్యూట్ చేసిన వారందరికీ ఇప్పటికే నోటీసులు అందించిన కోర్ట్ వారి మీద కేవలం సోషల్ మీడియా లో తిట్టిన విషయంలోనే కాకుండా, దాని వెనుక కుట్ర కోణం ఉందనే విషయాన్నీ జోడించి కేసులను నమోదు చేయించింది. దింతో భయబ్రాంతులకు గురిచేయడం, ప్రాణహాని కలిగించేలా హెచ్చరికలు వంటి సెక్షన్ లను అదనంగా జోడించారు. కావాలనే కొందరు న్యాయ వ్యవస్థ తీరుపై ప్రజల్లో చులకన భావం ఏర్పరచాలని కుట్రలో భాగంగా దీన్ని మొదలు పెట్టారని, ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక కుట్రగా కోర్టు భావిస్తోంది.

స్పీకర్, ఉప ముఖ్యమంత్రి, విజయసాయి వ్యాఖ్యలు సైతం

సోషల్ మీడియా వేదికగా కోర్టును అనరాని మాటలు అనడమే కాకుండా, వాటిని ఇష్టానుసారం షేర్లు చేయడం కామెంట్స్ పెట్టిన మొత్తం 16 మంది వ్యక్తులను కోర్టు గుర్తించింది. వీరిలో ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. ఇక కేసులో కీలకం కానున్నవి స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక సమావేశంలో మాట్లాడుతూ కోర్టులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, అలాగే చిత్తూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సైతం కోర్టుల తీరు సరిగా లేదు అనేలా మాట్లాడటం, వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కోర్టుల పరువు దిగజార్చేలా వ్యాఖ్యానించిన సమాసం సిబిఐ జాగ్రత్తగా పరిశీలిస్తుంది. రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు మరో రాజ్యాంగ వ్యవస్థలో కీలకం అయినా కోర్టులను ఏమైనా అనొచ్చా..? అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే దాన్ని పరిశీలిస్తున్నారు. ముగ్గురు నేతలు వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలు తాలూకా ఫుటేజ్ సంపాదించే పనిలో సిబిఐ ప్రత్యేక టీమ్ ద్రుష్టి పెట్టింది. దీనిలో ఎలాంటి లీగల్ అంశాలు ప్రభావితం కాకుండా తగిన జాగ్రత్తలు తీస్కుని ఆధారాలను సేకరించనున్నారు. అయితే ముగ్గురు నేతల మాటలను పరిశీలించిన తర్వాత దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కోర్టు నిర్ణయించనుంది. కోర్టు ఆదేశాలతోనే సిబిఐ రంగంలోకి దిగడంతో దీని తాలూకా పూర్తి నివేదిక కోర్టుకే అందజేయనున్నారు. దీనికి 8 వారాల గడువును కోర్టు పెట్టింది.

ఎం జరుగుతుందో?

కోర్టు ఆదేశాలతో పూర్తి నివేదిక సిబిఐ ఇస్తే, దానిలోని అంశాల ఆధారంగా కేసుల నమోదుకు కోర్టు ఆదేశిస్తుంది. మరి ఈ కేసులో వైస్సార్సీపీ కీలక నాయకులూ ఉండటం వారి వ్యాఖ్యలు కోర్టు సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో నాయకుల మీద కూడా కేసులు నమోదు చేయాలనీ కోర్టు ఆదేశిస్తుందా ఒకవేళ ఆదేశిస్తే వారి అరెస్టులు సాధ్యమేనా ? అనేది కీలకం కానుంది. అందులో అధికార పార్టీ లోని నేతలను ప్రభుత్వమే అరెస్టు చేయగలదా లేదా ఇది మరో సంక్షోభం వైపు వెళుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. అలా కాకుండా కోర్టు కేవలం న్యాయవ్యవస్థను కించ పరిచే పోస్టులు పెట్టడం వెనుక కుట్రను చూడాలి అని, అలా మాట్లాడటం వెనుక, పోస్టులు పెట్టడం ఉద్దేశం తెలుసుకోవాలని భావిస్తే మాత్రం వైస్సార్సీపీ నేతలకు ఊరట కలుగుతుంది. సిబిఐ ఈ దర్యాప్తు మొత్తం ముగిసాక నేతలు మాట్లాడిన ట్టేరు పోస్టుల వెనుక అప్పటికి అప్పుడు వచ్చిన ఆవేశాలు మేరకే ఇదంతా జరిగింది అని తేల్చి నివేదిక ఇస్తే కోర్టు తన అపరిమిత అధికారాలతో కేసులో తగిన ఆదేశాలు ఇచ్చి క్షమాపణ చెప్పించి కేసులను తేల్చాయవచ్చు. అలా కాకుండా కోర్టులను కించపరచడం విషయాన్నీ సీరియస్ గా తీస్కుని ముందుకు వెళితే మాత్రం కేసు మరింత సంక్లిష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం సిబిఐ ఎప్పటికి నివేదిక ఇస్తుంది. దర్యాప్తు భాగంగా ఎలాంటి సాక్షాలను సేకరిస్తుంది ? ఎవర్ని విచారించనుంది అనేది కూడా ఆసక్తి కంగానే మారనుంది. దర్యాప్తులో భాగంగా నేతల తీరు, వారి సహకారం సైతం కోర్టు తుది నిర్ణయాన్ని ప్రభావితం చేయొచ్చు.

author avatar
Special Bureau

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju