NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వివేకా హత్య కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ .. విమర్శలకు తావులేకుండా ఆ కోణంలోనూ..

Share

మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. సీబీఐ వ్యక్తి టార్గెట్ గా విచారణ జరుపుతోందనీ, వివేకా హత్యకు అనేక రకాల కారణాలు ఉన్నాయని ఇంతకు ముందు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొనడంతో పాటు సీబీఐ అధికారులకు ఒక లేఖను అందించారు. విచారణపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో సీబీఐ అధికారులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. నిన్న వివేకా రెండో భార్య నుండి వాంగ్మూలం తీసుకున్న సీబీఐ అధికారులు ఇవేళ వివేకా అల్లుడు, డాక్టర్ సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి విచారించారు. సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ అధికారులు ఆయనను హైదరాబాద్ కార్యాలయానికి రప్పించుకుని విచారించారు. హత్యాస్థలంలో దొరికిన లేఖపై రాజశేఖరరెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తొంది. తొలుత ఆ లేఖను దాచి పెట్టమని చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లు సమాచారం. శనివారం సాయంతం 4 గంటలకు సీబీఐ కార్యాలయానికి వచ్చిన రాజశేఖర్ .. విచారణ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిపోయారు.

YS Vivekananda Reddy Murder Case

 

మరో పక్క వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. అనూహ్యంగా నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణ జరపడంతో తదుపరి ఇంకా ఎవరికి నోటీసులు ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వివేకాకు కుటుంబంలో విభేదాలు, ఆస్తుల వ్యవహారం, సెటిల్ మెంట్ల లావాదేవీల్లో విబేదాలు, అక్రమ సంబంధాల మధ్య విబేధాలు ఇలా ఉన్నాయంటూ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డిలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ దిశగానూ విచారణ చేసే క్రమంలో వివేకా రెండో భార్య నుండి, ఆ తర్వాత వివేకా అల్లుడి నుండి సీబీఐ అధికారులు స్టేట్ మెంట్ లు స్వీకరించినట్లుగా తెలుస్తొంది.

కేసు దర్యాప్తు దాదాపు చివరి దశకు వచ్చింది అనుకుంటున్న తరుణంలో కొత్త కొత్త విషయాలు తెరపైకి రావడంతో పాటు దర్యాప్తు అధికారి రాంసింగ్ ను పక్కన పెట్టి సీబీఐ సీట్ ఏర్పాటు చేయడంతో ఈ బృందం భవిష్యత్తులో విమర్శలకు తావు లేకుండా ఉండేందుకు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతోంది. ఈ కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీసి నెలాఖరులోగా విచారణ నివేదిక అందజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో నూతనంగా ఏర్పాటైన సీట్ .. ఆ దిశగా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లుగా కనబడుతోంది.

కేసిఆర్ తో ఎలాంటి లాలూచీ లేదని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి


Share

Related posts

మీ పిల్లలు గంటల కొద్దీ టీవీ, కంప్యూటర్ ముందు ఉంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

Kumar

మీరు పిల్లలతో ఇలా చేయిస్తున్నారా ?? ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలిసిన విషయం

Kumar

Nani : నాని, నితిన్‌లకి డిస్ట్రిబ్యూటర్స్ షాక్..థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో ఎలా రిలీజ్ చేస్తారంటూ నిరసనలు

GRK