NewsOrbit
న్యూస్

అక్టోబర్ 21న మహారాష్ట, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు

ఢిల్లీ: మహారాష్ట్ర, హరియానా అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. ఈ రెండు రాష్ట్రాలలో అక్టోబర్ 21న ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది, శనివారం  కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా ఎన్నికల షెడ్యూల్ వివరాలు ప్రకటించారు. ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని చెప్పారు. అక్టోబర్ నాల్గవ తేదీతో నామినేషన్‌ల స్వీకరణ ముగుస్తుంది. అక్టోబర్ అయిదున నామినేషన్‌ల పరిశీలన, నామినేషన్‌ల ఉప సంహరణకు అక్టోబర్ ఎడవ తేదీ వరకూ గడువు విధించారు. అక్టోబర్ 21న ఎన్నికలు నిర్వహించి 24న ఫలితాలు వెల్లడిస్తామని సునిల్ అరోరా తెలిపారు.

మహారాష్ట్రలో 288, హరియానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ తొమ్మిదవ తేదీన, హరియానా అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ రెండున ముగియనుంది. మహారాష్ట్రలో 8.94కోట్లు, హరియానాలో 1.82కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేయనున్నామనీ, భద్రతాపరమైనై చర్యలు చేపట్టనున్నామనీ అరోరా వెల్లడించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తామని అరోరా చెప్పారు.

మరోవైపు దేశవ్యాప్తంగా 64 చోట్ల ఉప ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది.

అక్టోబరు 21నే ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆరోడా తెలిపారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబరు 23న విడుదల కానుంది. సెప్టెంబరు 30తో నామినేషన్ల స్వీకరణ ముగుస్తుంది. అక్టోబరు ఒకటిన నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు మూడవ తేదీ వరకు గడువు విధించారు. అక్టోబరు 21న ఎన్నికలు నిర్వహించి అక్టోబరు 24న ఫలితాలు వెల్లడించనున్నారు.
తెలంగాణలోని హుజూర్‌నగర్‌తో పాటు అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒకటి, అసోంలో నాలుగు, బిహార్‌లో అయిదు, ఛత్తీస్‌గఢ్‌లో ఒకటి, గుజరాత్‌లో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లో రెండు,  కర్ణాటకలో 15, కేరళలో  అయిదు, మధ్యప్రదేశ్‌లో ఒకటి, మేఘాలయలో ఒకటి, ఒడిశాలో ఒకటి, పుదుచ్చేరిలో ఒకటి, పంజాబ్‌లో నాలుగు, రాజస్థాన్‌లో రెండు, సిక్కింలో మూడు, తమిళనాడులో రెండు, ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Leave a Comment