NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..! ఖాళీలు 510 , వివరాలు ఇదిగో..!!

 

భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్‌(ఎన్ఐఆర్‌డీపీఆర్) కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 510 ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్‌, యంగ్ ఫెలో, క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్ పోస్టుల భ‌ర్తీకి ఆన్లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. దేశ‌వ్యాప్తంగా క్ల‌స్ట‌ర్ మోడ‌ల్ గ్రామ‌పంచాయ‌తీలను అభివృద్ధి చేయడంలో భాగంగా భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ ఆధ్వ‌ర్యంలో ఎన్ఐఆర్‌డీపీఆర్ ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తోంది.. పూర్తి వివరాలు ఇలా..

 

 

మొత్తం ఖాళీలు: 510
1.స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్ ‌- 10 పోస్టులు
2. యంగ్ ఫెలో – 250 పోస్టులు
3. క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్ ‌- 250 పోస్టులు

విధులు :
1. స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్‌: క‌్ల‌స్ట‌ర్‌ మోడ‌ల్ గ్రామ‌పంచాయ‌తీల ఏర్పాటులో భాగంగా ఎంపిక చేసిన గ్రామ‌పంచాయ‌తీల‌లో జ‌రుగుతున్న ప‌నుల‌ను క్షేత్ర స్థాయిలో మానిట‌రింగ్ చేయడం వీరి కర్తవ్యం.
2. యంగ్ ఫెలో: క్షేత్రస్థాయిలో గ్రామ‌పంచాయ‌తీల‌కు వెళ్లి వివిధ శాఖ‌ల‌ అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి వారికి గ్రామ‌పంచాయ‌తీ ప‌నుల‌ను వివ‌రిస్తూ.. వారితో క‌లిసి అభివృద్ధి ప‌నుల్లో పాల్గొన‌డం వీరు పని.
3. క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్‌: వీళ్లు వార్డు స్థాయిలో ప్ర‌జలను గ్రామంచాయ‌తీ విధుల్లో ( వార్డ్ స‌భ‌, మ‌హిళా స‌భ‌,గ్రామ ‌స‌భ‌‌) లలో పాల్గొనేలా వారిని చైత‌న్య‌వంతుల్ని చేయాలి.

అర్హ‌తలు ‌:
1. స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్‌:
అర్హ‌తలు ‌: సోష‌ల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ (ఎక‌న‌మిక్స్‌/ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌/ రూర‌ల్ మేనేజ్‌మెంట్‌/ పొలిటిక‌ల్ సైన్స్‌/ ఆంథ్ర‌పాల‌జీ/ సోష‌ల్‌వ‌ర్క్‌/ డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌/ హిస్ట‌రీ) ఉత్తీర్ణ‌త‌తో పాటు క‌నీస అక‌డ‌మిక్ మెరిట్ (ప‌దోత‌ర‌గ‌తి నుంచి పీజీ వ‌ర‌కు) కూడా అవ‌స‌రం. ప‌దో త‌ర‌గ‌తిలో 60%, ఇంట‌ర్మీడియ‌ట్‌లో 50%, గ్రాడ్యుయేష‌న్‌లో 50%, పోస్టు గ్రాడ్యుయేష‌న్‌లో 50% మార్కులు ఉండాలి.
వ‌య‌సు: 01.11.2020 నాటికి 30-50 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ&ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
2. యంగ్ ఫెలో:
అర్హ‌తలు ‌: సోష‌ల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా(ఎక‌న‌మిక్స్‌/ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌/ రూర‌ల్ మేనేజ్‌మెంట్‌/ పొలిటిక‌ల్ సైన్స్‌/ ఆంథ్ర‌పాల‌జీ/ సోష‌ల్‌వ‌ర్క్‌/ డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌/ హిస్ట‌రీ) ఉత్తీర్ణ‌త‌. అక‌డ‌మిక్ మెరిట్ ప‌దో త‌ర‌గ‌తిలో 60%, ఇంట‌ర్మీడియ‌ట్‌లో 50%, గ్రాడ్యుయేష‌న్‌లో 50%, పోస్టు గ్రాడ్యుయేష‌న్‌లో 50% మార్కులు ఉండాలి.
వ‌య‌సు: 01.11.2020 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎస్సీ & ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
3. క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్‌:
అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తోపాటు సెల్ప్ హెల్ప్ గ్రూప్స్‌లో ప‌ని చేసిన అనుభ‌వం/ సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ లీడర్‌గా ప‌ని చేసి ఉండ‌డం/ ఎన్ఐఆర్‌డీపీఆర్‌/ ఎన్ఆర్ఎల్ఎం/ ఎస్ఆర్ఎల్ఎం నుంచి సంబంధిత స‌ర్టిఫికెట్ ప్రోగ్రాములు చేసి ఉండాలి.
వ‌య‌సు: 01.11.2020 నాటికి 25-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎస్సీ & ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతన వివరాలు :
1. స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్‌: నెల‌కు రూ.55 వేలు
2. యంగ్ ఫెలో: నెల‌కు రూ.35 వేలు
3. క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్‌: నెల‌కు రూ.12,500.
దీనితో పాటు ఎన్ఐఆర్‌డీపీఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌యాణ‌, ఇత‌ర ఖర్చుల‌ను చెల్లిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: డిసెంబర్‌ 29, 2020.
వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N