NewsOrbit
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

“రెక్కలు వద్దంటున్న రైతు”..! ఆ బిల్లు లోతు తెలుసా..!? (పార్ట్ – 1 )

“తనకు నష్టం కలిగిస్తే ఏ రైతు భరించడు. రైతుకి నష్టం చేయాలని ఏ ప్రభుత్వమూ చూడదు..! అయితే రైతు పేరుతో రాజకీయాలు చేయాలని.., రైతు శ్రమతో సంపాదించాలని.., రైతు ఉత్పత్తులతో వ్యాపారం చేయాలని.., రైతు పేరిట ఓట్లు రాబట్టుకోవాలని పార్టీలు, ప్రభుత్వాలు భావిస్తుంటాయి” ఈ వ్యవసాయ బిల్లులు అదే కోవలోకి వస్తాయి. మూడు నెలల కిందట కేంద్రం మూడు వ్యవసాయ బిల్లులను ఆమోదించింది. వాటికి నిరసనగా పంజాబ్, హర్యానా ప్రాంత రైతులు వేలాదిగా ఆందోళనలు చేస్తున్నారు. వారికి మద్దతుగా నిన్న భరత్ బందు కూడా జరిగింది. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే..? ఈ బిల్లుల్లో లోతులు తెలియకుండానే.., రైతులకు లాభనష్టాలు బేరీజు వేయకుండానే చాల పార్టీలు పోరాటాలకు దిగాయి. సేద్యం బిల్లు కాస్త రాజకీయ రగడగా మారిపోయింది. అసలు ఆ బిల్లుల్లో ఏముంది..? రైతులకు లాభమా? నష్టమా..? రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? బీజేపీ చేయాల్సిన మార్పులు ఏంటి..? అనేది చూద్దాం..!!

Farm bill 2020

అమ్మకానికి హద్దుల్లేవోయ్… ఓ రైతు తెలుసా నీకు..!!

రైతుకి తెలుసో.., తెలియదో..!! ఈ బిల్లులో కీలక అంశం ఇది. రైతుల పంటలు అమ్మకానికి హద్దుల్లేవు. సిమ్లాలో పండిన ఆపిల్ ఆంధ్రాలో అమ్ముకోవచ్చు (మధ్యవర్తులు, దళారులు లేకుండా నేరుగా ఇక్కడి వారితో మాట్లాడుకుని అమ్ముకోవచ్చు)..! కేరళలో పండే అరటి పంజాబ్ లో అమ్ముకోవచ్చు. పంజాబ్ లో పండే గోధుమ ఆంధ్రాలో అమ్ముకోవచ్చు. ఎక్కడి వారు ఎక్కడైనా అమ్ముకునే వీలుంది. ఇది బిల్లులో కీలకమైన అంశం ఇది.

* ఇప్పటివరకు రైతు తాను పండించిన పంటను స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ (మండి) లోనే విక్రయించేవాళ్ళు. ప్రభుత్వ మద్దతు ధరను అనుసరించి అక్కడి ఇచ్చింది తీసుకునే వాడు. అక్కడే లోపం జరిగేది. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో (మండీల్లో) దళారీలు తిష్ట వేసి రైతులను మోసం చేసేవారు. మద్దతు ధర రావాలంటే నాణ్యత పేరిట రకరకాల వంకలు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టేవారు. రైతు ధర లేకున్నా దళారీలు చెప్పిన ధర గిట్టుబాటు కాకుండా వారికే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. మరో మార్కెట్ యార్డుకు తీసుకువెళ్లడానికి గానీ మరో చోట అమ్ముకోవడానికి గానీ రైతుకు అవకాశం ఉండేది కాదు. ఒకవేళ అలా తీసుకువెళ్లినా కొనేందుకు ఎవరూ రాకపోగా స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత వచ్చేది.
* ఇప్పుడు నూతన వ్యవసాయ విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ద్వారా రైతుకు పరిమితులు లేవు. తన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కష్టం ఫలితాన్ని ఎక్కడైనా పొందవచ్చు. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు, రైతులు కలిసి పంటను తీసుకొని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నిల్వ చేసుకున్న పంటను ప్రైవేట్ సంస్థలు మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకోవడానికి బిల్లు వెసులుబాటు కల్పిస్తుంది. అంటే ఈ ఆర్డినెన్స్ ద్వారా కచ్చితంగా మార్కెట్ యార్డు ద్వారానే పంటను అమ్ముకోవాలని నిబంధన తీసి వేసినట్లు అయింది. తన ఇష్టం మేరకు పంటను ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కడైనా అమ్ముకోవచ్చు.

BJP : BJP - Congress Mind Game
Farmers in Delhi

అభ్యంతరాలు ఎందుకంటే..!?

ఈ బిల్లు విషయంలోనే ప్రధానంగా పంజాబ్, హరియాణా రైతులు అభ్యంతరం చెప్తూ ఆందోళనలు చేస్తున్నారు. దీనికి కొన్ని స్పష్టమైన కారణాలున్నాయి. దేశం మొత్తం మీద ఆరు వేల మార్కెట్ యార్డులు ఉంటె.., వాటిలో 2 వేల వరకు ఆ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆ రెండు రాష్ట్రాల్లో పండే గోధుమ, వరి పంటలను అక్కడే అమ్ముకునేవారు. ప్రభుత్వమే మార్కెట్ యార్డుల ద్వారా మంచి ధరకు పంట కొంటుంది. అక్కడ వీటిని మండీ అంటారు. రైతుల ఉత్పత్తులన్నీ లావాదేవీలు జరిగేది మండిలు లోనే..!
* ఇప్పుడు ఈ బిల్లు ద్వారా.. ఆ గోధుమ, వరి పంటలను ఎవరైనా రైతుతో మాట్లాడి ధర ఇచ్చి కొనుక్కోవచ్చు. సో.., ఎఎంసిలతో పని ఉండదు. వాటి స్థానంలో కార్పొరేట్ మార్కెట్ యార్డులు వస్తాయి. ప్రభుత్వానికి వ్యవసాయంపై అజమాయిషీ ఉండదు. బాధ్యత ఉండదు. అంటే ఇక్కడ కార్పొరేట్ వాళ్ళు ఎంత ధర ఇస్తే అంతకు అమ్ముకునే పరిస్థితులు వస్తాయనేది రైతుల్లో ప్రధాన భయం. కానీ మన రాష్ట్రాల్లో ఎందుకు ఈ రకమైన వ్యతిరేకత రావట్లేదు అంటే..? ఇక్కడి రైతులు మార్కెట్ యార్డులు, ప్రభత్వానికి అమ్మేది చాల తక్కువ. ప్రభుత్వం సైతం లెవి (నిష్పత్తి) ప్రకారం పంటను కొనుగోలు చేసేది. బయట వ్యక్తులే ఎక్కువ పంటను కొంటారు. ఎంతో అంత ఇస్తారు. దింతో మన దగ్గర దీనిపై గొడవ లేదు.

స్వేచ్ఛ ఇస్తే కాదంటారా..? కొన్ని మార్పులు అవసరమే..!!

రైతుకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇచ్చి.., రెక్కలు ఇష్టం అంటే ఎవరైనా వద్దు అంటారా..? కానీ పంజాబ్, హరియాణా రైతులు వద్దు అంటున్నారు. దీనికి బయటకు చెప్పుకునే కారణాల కంటే లోలోపల కారణాలే అధికంగా ఉన్నాయి. “అక్కడ ఈ గోధుమ ఉత్పత్తులతో దళసరిగా మారి వ్యాపారాలు చేస్తున్నది రాజకీయ నేతలే. అన్ని పార్టీల్లోనూ ఉన్న చాల మంది నేతలు ఈ రకమైన వ్యాపారాల ద్వారానే బాగా సంపాదించారు. ఇప్పుడు రైతుకి స్వేచ్ఛ వస్తే పంటను వారికి కాకుండా.., ఎక్కడైనా, ఎంతకైనా, ఎవరికైనా అమ్ముకోవచ్చు. సో.., వారి ఆటలు సాగవు. అందుకే ఆ నేతలే ఇప్పుడు రైతులను రెచ్చగొట్టి చేయిస్తున్నారు అనేది ఒక వాదన. కొందరు అయితే గోధుమలు నిల్వ చేసి విదేశాల్లో వైన్ తయారీ కంపెనీలకు కూడా అమ్ముతారు అనే వాదనలు ఉన్నాయి. ఈ ఆర్ధిక లావాదేవీలు అన్ని నిలిచిపోతాయని భయంతో కాంగ్రెస్, అకాలీదళ్, అక్కడి బీజేపీ నేతలు కూడా రైతుల వెనుక ఉంటూ… రైతుల పేరిట ఉద్యమాలు చేయిస్తున్నారు అనేది ఒక లోపలి అంశం.
* అయితే ఇక్కడ కొన్ని మార్పులు అవసరమే..! బీజేపీ కూడా రైతులకు అవగాహనా కల్పించడం.., వారికి ఇచ్చే స్వాతంత్య్రాన్ని వెల్లడించి.. మంచి ధరకు అమ్ముకునే ప్రత్సాహించడం. కనీస మద్దతు ధర ఒకటి నిర్దేశించి… దీని కంటే తక్కువకు కొనకూడదు అని కార్పొరేట్ కి కళ్లెం వేయడం.., వంటి సంస్కరణలు చేయాల్సి ఉంది. ఇలా వారి, వీరి అభ్యంతరాలు సహా.., కొన్ని కీలక సంస్కరణలు చేస్తే “ద్విప్రయోజనాలు”.. అటు బీజేపీ అంటారా ఉద్దేశాలు నెరవేరుతాయి..!!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju