NewsOrbit
National News India ట్రెండింగ్ న్యూస్

Chandrayaan-3: రేపు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్! శాటిలైట్, స్పేస్ క్రాఫ్ట్స్‌పై బంగారు రంగు కవరింగ్ ఎందుకు వేస్తారో తెలుసా?

Chandrayaan-3

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్-3’ ప్రయోగం తుది ఘట్టానికి చేరుకుంది. రాబోయే సమస్యలను ముందస్తుగానే అంచనా వేసి చంద్రయాన్-3 ప్రయోగాన్ని డిజైన్ చేసింది. రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ చంద్రుడిపై చివరి నిమిషంలో కూలిపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు. ల్యాండర్ మాడ్యూల్‌కు సంబంధించి ప్రతికూలతలు ఎదురైనప్పుడు ల్యాండింగ్ తేదీని మార్చేస్తామని చెప్పారు. ఆగస్టు 27న విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తామన్నారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం.. ఆగస్టు 23వ తేదీ (బుధవారం) సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్‌ దిగేందుకు ముహూర్తం ఖరారైంది.

Chandrayaan-3
Chandrayaan-3

అంతా అనుకున్నట్లు జరిగితే భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో చంద్రయాన్-3 ప్రయోగం కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ప్రయోగం విజయవంతం అయిన తర్వాత స్పేస్ సైన్స్‌పై చాలా మందిలో ఆసక్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయోగం విజయవంతం అయితే భారత ఖ్యాతి మరింతగా పెరుగుతుంది. చంద్రుడిపై ఉండే చిత్రాలు, వీడియోలు, ఇతర దృష్యాలను మనం చూడవచ్చు. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ చుట్టూ బంగారు రంగులో కవరింగ్ చేస్తారు. అయితే ఆ బంగారు రంగు కవరింగ్ ఎందుకు పూస్తారు? దాని వల్ల ఉపయోగాలేమిటీ? తదితర విషయాల గురించి తెలుసుకుందాం..

బంగారు రంగులో కనిపించే ఆ లేయర్ బంగారం కాదు. అలా అని ఫోయిల్ కూడా కాదు.స్పేస్ క్రాఫ్ట్‌లు, శాటిలైట్‌లపై బంగారు రంగులో చుట్టినట్లు కనిపించే దాన్ని ‘మల్టీ లేయర్ ఇన్సులేషన్’ అంటారు. ఇది ఉష్ణ నిరోధంగా పని చేస్తుంది. ఈ ఫిల్మ్‌ను అనేక పొరలుగా స్పేస్ క్రాఫ్ట్‌లు, శాటిలైట్‌లపై చుడతారు. అయితే పైన కనిపించే పొర బంగారు రంగులో ఉన్నప్పటికీ లోపల తెలుపు, వెండి రంగుల్లో ఉంటుంది.

Chandrayaan-3
Chandrayaan-3

ఈ బంగారు రంగు ఫిల్మ్‌ను దేనితో తయారు చేస్తారు?
ఈ బంగారు రంగు ఫిల్మ్‌ను ‘పాలిస్టర్’తో తయారు చేస్తారు. దానిపైన అత్యంత పలుచని అల్యూమినియం పొర ఉంటుంది. స్పేస్ క్రాఫ్ట్ మొత్తాన్ని ఈ బంగారు రంగు ఫిల్మ్ చుట్టరు. కేవలం రేడియేషన్‌కు గురయ్యే ప్రాంతాల్లో, పాడవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉండే భాగాల్లో మాత్రమే ఈ బంగారు ఫిల్మ్‌తో కవర్ చేస్తారు. స్పేస్ క్రాఫ్ట్, శాటిలైట్‌లలో ఎన్ని సున్నిత భాగాలు ఉన్నాయో గుర్తించి.. దానికి తగ్గట్లు బంగారు రంగు ఫిల్మ్‌ను తయారు చేస్తారు.

Chandrayaan-3
Chandrayaan-3

ఉష్ణోగ్రతను తట్టుకునేలా..
భూమి నుంచి అంతరిక్షంలో ప్రయాణించేటప్పుడు ఉష్ణోగ్రతలు మారుతుంటాయి. స్పేస్ క్రాఫ్ట్, శాటిలైట్‌లలో ఉండే సున్నితమైన పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాతావరణంలో వచ్చే హఠాత్తు మార్పులకు పరికరాలు పని చేయకుండా పోతాయి. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. అందులోనుంచి బయట పడేందుకు ఉష్ణమాపక పొరలతో పరికరాలను కప్పి ఉంచుతారు.

Chandrayaan-3
Chandrayaan-3

నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ శాటిలైట్ డాటా ప్రకారం..
స్పేస్ క్రాఫ్ట్స్‌ను ఉష్ణమాపక పొరలతో కప్పడానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అమెరికా ‘నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ శాటిలైట్ డేటా, ఇన్ఫర్మేషన్ సర్వీస్’లో పొందుపర్చింది. దీని ప్రకారం.. స్పేస్ క్రాఫ్ట్, శాటిలైట్‌లు ఎంత వరకు ఉష్ణోగ్రతను ఎదుర్కొంటాయే అంచనా వేసి మల్టీ లేయర్ ఇన్సులేషన్ షీట్లను తయారు చేస్తారు. -200 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి -300 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నుంచి ఈ లేయర్ రక్షణ కల్పిస్తుంది. రేడియేషన్, ఉష్ణోగ్రత, అంతరిక్షంలోని దుమ్ము ధూళి నుంచి స్పేస్ క్రాఫ్ట్‌, శాటిలైట్‌లకు రక్షణ కల్పిస్తుంది.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N