Hasta: హస్తా మొదటి పాదం కుజుడి కి చెందినది. పాప కర్మలు చేయువారుగా, బలవంతులుగా , చింతన కలిగిన వారీగా ఉంటారు.
హస్తా నక్షత్ర రెండొవ పాదం శుక్రుడికి చెందినది. ఎప్పుడు మంచి మాటలనే మాట్లాడుతూ ఉంటారు. కాస్త మంధ బుద్ధి తో ఉంటారు. హస్తా నక్షత్ర మూడోవ పాదం బుధుడికి చెందినది. మంచి బుద్ది లేనటువంటి వారు , కాముకులుగా ఉండేవారుగా, వ్యాపార రంగాయానికి సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్ళు అంశం లో గొప్ప స్కిల్స్ ఉంటాయి వీరికి . హస్తా నక్షత్రం నాల్గొవ పాదం చంద్రుడి కి చెందినది. వీరికి రాచకార్యాలు చేయడం అంటే ఇష్టం. సన్మానాలు చేయిన్చుకునేవారిగా, అభిమానం కలవారిగా , కాస్త కోపం ఉన్నవారిగా ఉంటారు.
Hasta: చిత్రా నక్షత్ర నాలుగు పాదాలు
చిత్రా నక్షత్రమొదటి పాదం రవి కి చెందినది. స్థిరం లేని మనస్సు కలవారిగా, ఉగ్ర స్వభావం తో కనిపిస్తుంటారు.
చిత్రా నక్షత్ర రెండొవ పాదం బుధుడి కి చెందినది. తియ్య తియ్యగా మాట్లాడి జనాల నమ్మకం పొందుతుంటారు. కోపం వస్తే మాత్రం ఎక్కువ కాలం పోదు. ఏ పని అయినా కుడి చాలా కాలం పాటు అయ్యేలా చేస్తారు.చిత్రా మూడో పాదం శుక్రుడి కి చెందినది. వీరు కీర్తి కలిగినవారుగా , శౌర్య వంతం గా , పండితుల తో కలిసి ఉండువారు గా , వారితోనే కాలం గడపటం వీరికి లక్షణాలు గా చెప్పబడింది.చిత్రా నాల్గొవ పాదం కుజుడి కి చెందినది. వీరు చిన్న వయ్యస్సులోనే దొంగతనాలు చేస్తారు. తగినంత సంపాదించుకుని నేరాలు చేయడం ఆపేస్తారు. చాలా ధైర్యవంతులు గా చెప్పబడతారు.