Bigg Boss: సన్నీ ని తెలివిగా వాడుతున్న కంటెస్టెంట్ లు..??

Share

Bigg Boss: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ దాదాపు సగం సీజన్ పూర్తయింది. 8 వారాలు గడిచినా ఈ క్రమంలో 19 మంది ఇంటి సభ్యులు ఎంట్రీ ఇవ్వగా ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. దీంతో చాలావరకు గేమ్ చివరిదశకు వచ్చే పరిస్థితులు ఏర్పడుతూ ఉండటంతో.. సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ గురించి బయట రకరకాల డిస్కషన్ లు జరుగుతున్నాయి. ఈ తరుణంలో టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా సన్నీ(Sunny), షణ్ముఖ్ జస్వంత్(Shanmukh), శ్రీరామ్(Sri Ram), రవి(Ravi), యానీ(Yaani) గెలిచే అవకాశాలు ఉన్నట్లు బయట టాక్ నడుస్తోంది. ముఖ్యంగా టాస్క్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా.. ఆల్ రౌండర్ గా సన్నీ పేరు డబుల్ త్రిబుల్ గా వినబడుతోంది. ఒక్క కోపం మినహా చాలా విషయాలలో సన్నీ మాస్క్ లేని గేమ్ ఆడుతున్నట్లూ బయట జనాలు చెప్పుకుంటున్నారు.

VJ Sunny Catches Nagarjuna's Eye, Riles BB Housemates

ముఖ్యంగా ఏడ వారంలో సన్నీ ఆడిన ఆట తీరు అతని ఓటింగ్ గ్రాఫ్ అమాంతం పెంచేసింది అని అంటున్నారు. ప్రియ ఆంటీ ఎంత రెచ్చగొట్టినా గాని.. రెచ్చిపోతూ.. సన్నీ ఆడిన గేమ్ ఈ సీజన్ ఫైవ్ కి హైలెట్ అని జనాలు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే సన్నీ లో ఉన్న అతి పెద్ద మైనస్ పాయింట్.. కోపంతో ఊగిపోతూ మాట్లాడటం అని కూడా చెబుతున్నారు. ఎదుటి వాళ్ళు చెబుతున్న పాయింట్ అర్థం చేసుకోకుండా సన్నీ తన ఇష్టానుసారంగా కోపంలో కొన్ని పదాలు వదులుతున్నాడు.. ఈ క్రమంలో అతని ముందు పెట్టుకుని వెనకాల కొంతమంది గేమ్ ఆడుతున్నారని చెబుతున్నారు. వాళ్ళు ఎవరో కాదు హౌస్ లో సన్నీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే స్నేహితులుగా భావించే మానస్,కాజల్ అని అంటున్నారు. వీరిద్దరిలో కాజల్ సన్నీ కోపాన్ని బాగా క్యాష్ చేసుకుని… తన ప్రత్యర్థులపై సన్నిని రెచ్చగొట్టి వదులుతుందని పేర్కొంటున్నారు.

Bigg Boss Telugu 5: THESE contestants are nominated for eviction? | Bollywood Bubble

గేమ్ ఆడితే… టాప్ ఫైవ్ లో 

ఏడవ వారం నుండి సన్నీతో.. చాలా క్లోజ్ గా ఉంటూ కాజల్.. బాగా లబ్ధి పొందుతుందని చెప్పుకొస్తున్నారు. సన్నీ అంతగా రెచ్చిపోవడానికి హౌస్ సభ్యులపై.. ఈ రెండు వారాలలో గొడవ దిగటానికి ఎక్కువ శాతం కాజల్.. రెచ్చగొట్టే వైఖరితో సన్నీకి చెప్పిన మాటలే అని అంటున్నారు. ఇక ఇదే తరుణంలో మానస్ కూడా… ఒక పక్క తన ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతూ ఉంటే మరోపక్క సన్నీని రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నాడని ఎనిమిది వారంలో.. ఆ రీతిగానే మానస్ వ్యవహారం ఉందని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఈ విధంగా సన్నీ తన ఇద్దరి స్నేహితుల నమ్ముకుంటూ రానున్న రోజుల్లో గేమ్ ఆడితే… టాప్ ఫైవ్ లోకి వెళ్లిన గాని టైటిల్ గెలిచే అవకాశాలు తక్కువ అని బయట జనాలు ఆటతీరుపై.. డిస్కషన్లు చేసుకుంటున్నారు. సన్నీ తన పరంగా గేమ్ బాగా ఆడుతున్నా గాని.. వాళ్ళిద్దరు గొడవ ల విషయంలో కలుగజేసుకుని చాలా వరకు హౌస్లో మైనస్ అయిపోతున్నాడని.. బిగ్బాస్ ఆడియన్స్ అంటున్నారు. తనకు సంబంధం లేని చాలా విషయాలలో సన్నీ.. కలుగజేసుకుని మిగతా ఇంటి సభ్యులకు కూడా ఒక మూసి లాగా మారిపోతున్నాడు అని.. ఇదే రీతిలో సన్నీ గుడ్డిగా నమ్మకు కుంటూ కాజల్, మానస్ కి… ఇంకా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోతే.. రానున్న రోజుల్లో టాప్ 5 కూడా వెళ్లే అవకాశాలు తక్కువే అని అంటున్నారు. ఏది ఏమైనా గేమ్ పరంగా సన్నీ ఇతరుల విషయాల్లో కలుగజేసుకొని కుండా తన గేమ్ తాను ఆడుకుంటూ… హౌస్ లో రాణిస్తే సన్నీకి తిరుగుండదు.. అని అంటున్నారు.


Share

Related posts

Tarun: ఎన్నో సినిమాలు చేస్తూ ఇప్పుడు స్టార్‌గా ఇండస్ట్రీలో వెలగాల్సిన తరుణ్ అందుకే అవకాశాలు దక్కించుకోలేపోతున్నాడా..?

GRK

సొంత అజెండాతో జనసేనాని ముందుకు ? మౌన ముద్ర అందుకు!!

Yandamuri

Telangana Congress: రెండు కాంగ్రెస్ కత్తులు ఒకే ఒరలో ఇమిడాయా?తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఆ ఆసక్తికరమైన సంఘటన ఏమిటంటే?

Yandamuri