Cyberabad Police : బైక్ మీద బయటికి వెళ్తున్నారా.. మరి హెల్మెట్ ధరించరా.. హా.. ఏమవుతుందిలే.. మహా అయితే చలనా కట్టాలి అంతేగా.. అలా అనుకుంటు నిర్లక్ష్యంగా బైక్ తో రోడ్డెక్కేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే.. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసారు..
హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ మొదటి సారి పట్టుబడితే 3 నెలలు, రెండో సారి కూడా దొరికిపోతే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫార్సు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.. అంతేకాకుండా నాణ్యమైన హెల్మెట్లు ధరించాలని.. బైక్ నడుపుతున్న వ్యక్తి తో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని ట్రాఫిక్ పోలీసుల విభాగం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక షార్ట్ వీడియో ను రిలీజ్ చేశారు..