ట్రెండింగ్ న్యూస్ సినిమా

Start Music : నేను ఎవ్వరితో డేట్ చెయ్యను.. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.. అసలు రహస్యం చెప్పేసిన శ్రీముఖి?

Start Music : నేను ఎవ్వరితో డేట్ చెయ్యను.. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.. అసలు రహస్యం చెప్పేసిన శ్రీముఖి?
Share

Start Music : స్టార్ట్  మ్యూజిక్ Start Music షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ట్ మ్యూజిక్ షోను ఇటీవలే ప్రారంభించారు. యాంకర్ సుమ ఈ షోను హోస్ట్ చేస్తోంది. అయితే.. ఈ షోకు ప్రస్తుతం బాగానే రెస్పాన్స్ వస్తోంది. స్టార్ట్ మ్యూజిక్ షోకు వచ్చే గెస్టులతో కలిసి సరదాగా సందడి చేసే ప్రోగ్రామ్ ఇది. ఇందులో ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి.. పర్సనల్ విషయాలు ఉంటాయి. మొత్తం మీద ఈ షోలో ఎంటర్ టైన్ మెంట్ మాత్రం పక్కా.

Start Music : Sreemukhi shocking comments in start music show
Start Music : Sreemukhi shocking comments in start music show

నిజానికి ఈ షోను ఎంటర్ టైన్ మెంట్ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. బుల్లితెర ప్రేక్షకులు ఈ షోను ఆదరిస్తున్నారు కూడా. అయితే.. ఈ షోలో తాజాగా శ్రీముఖి, డ్యాన్సర్ పండు, విష్ణుప్రియ, రోల్ రైడా, హరి లాంటి వాళ్లు వచ్చి సందడి చేశారు.

Start Music : షోలో కాస్త సీరియస్ అయిన శ్రీముఖి

అయితే.. స్టార్ట్ మ్యూజిక్ షోలో శ్రీముఖి కాస్త సీరియస్ అయింది. శ్రీముఖి నువ్వు ఎవరితో డేట్ చేస్తావు అని యాంకర్ సుమ అడగగా… నేను ఎవ్వరితో డేట్ చేయను… నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరితో డేట్ చేసే ఖర్మ నాకేంటి.. అంటూ శ్రీముఖి కాస్త ఘాటుగానే స్పందించడంతో.. ఏం చేయాలో తెలియక తికమక పడింది యాంకర్ సుమ. మిగితా కంటెస్టెంట్లు, స్టేజ్ మీద ఉన్నవాళ్లు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. శ్రీముఖి ఎందుకింత సీరియస్ అవుతోంది అని. మొత్తం మీద తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.. అనే విషయాన్ని మాత్రం శ్రీముఖి చెప్పేసింది.

తాజాగా స్టార్ట్ మ్యూజిక్ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.

 


Share

Related posts

AP High court: కుప్పం మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!

somaraju sharma

వికేంద్రీకరణకు మద్దతుగా బైక్ ర్యాలీ

somaraju sharma

బ్రేకింగ్: జగన్ వదిలిన మరో పథకం..!

Vihari