ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ విద్యా వ్యవస్థ పై ఢిల్లీ డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్..!!

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పేదవాళ్లకు చదువు భారం కాకూడదని ఉన్నత విద్య దూరం కాకూడదు “అమ్మ ఒడి”, “జగనన్న విద్యా కానుక” వంటి పథకాలతో వాళ్లకి ఎంతగానో మేలు చేసిన సంగతి తెలిసిందే.

Delhi Deputy CM Manish Sisodia suffering from dengue and COVID-19ముఖ్యంగా తన పాదయాత్రలో పేదవాళ్లు తమ బిడ్డలను ఆర్థిక భారం వల్ల చదువు చదివించ లేని స్థితిలో ఉండటం చూడటం వల్ల ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ ఇటీవల రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమం అమలు చేస్తున్న టైం లో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే తరుణంలో విద్యార్థులకు ల్యాప్టాప్ లు అతి తక్కువ ధర కి అందుబాటులోకి తెచ్చినట్లు కూడా చెప్పుకొచ్చారు.

 

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగంలో వస్తున్న మార్పులు జగన్ చేస్తున్న సంస్కరణల పట్ల ఢిల్లీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ విద్యా సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిపై ప్రశంసలు..నాడు-నేడు, విద్యాకానుక, ప్రీ స్కూల్స్, సంస్కరణలపై ఢిల్లీ ప్రభుత్వం ప్రశంసలు వర్షం కురిపించింది. త్వరలోనే ఏపీలో విద్యా వ్యవస్థలో జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు అమలవుతున్న పథకాలు వాటి పనితనం ఎలా ఉందో క్షుణ్నంగా పరిశీలించడానికి ఢిల్లీ డిప్యూటీ సీఎం ఏపీలో పర్యటిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఒక్క డిల్లీ రాష్ట్రంలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా రంగంలో మార్పులపై చర్చ జరుగుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కుర్రవాడిగా సీఎం స్థానం లో ఉన్న జగన్.. ప్రస్తుత తరానికి కావలసిన విద్యను అదే రీతిలో అందించే విధంగా విద్యావ్యవస్థలో మార్పు కోసం తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు దేశవ్యాప్తంగా హైలైట్ అవుతున్నాయని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.


Share

Related posts

జగన్ పంతం × రాజ్యాంగం : గెలిచేది ఎవరో తెలుసు ప్రజాధనం వృథా తప్ప

Special Bureau

Charging stations : ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. కొత్తగా 10 చార్జింగ్ స్టేషన్లు..

bharani jella

Amit Shah: బెంగాల్లో పర్యటనకు అమిత్ షా ఎందుకు రాలేదో..? కారణమదేనా..??

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar