న్యూస్ సినిమా

నాని ‘శ్యామ్ సింఘ రాయ్’ కథ క్లైమాక్స్ కి చేరినట్టేనా ..?

Share

నాని ‘శ్యామ్ సింఘ రాయ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. టాక్సీవాలా సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ సంకృత్యన్ nani ని ఈ సినిమాలో ముందెన్నడు చూడని క్యారెక్టర్ లో చూపించబోతున్నాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమాని నిహారిక ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో nani ‘శ్యామ్ సింఘ రాయ్’ తెరకెక్కుతోంది.

సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమియం ఫ్యాక్టరీలో నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది. వాస్తవంగా అయితే nani ‘శ్యామ్ సింఘ రాయ్’ కలకత్తా లోనే షూటింగ్ జరపాలని చిత్ర బృందం సన్నాహాలు చేశారు. కాని ప్రస్తుతం కరోనా కారణంగా రిస్క్ చేయకూడనుకున్న దర్శక, నిర్మాతలు కలకత్తా బ్యాక్ డ్రాప్ సెట్ ని ఇక్కడే నిర్మించారు. కాగా ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ ని పూర్తి చేస్తున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్.

కాగా ఈ క్లైమాక్స్ లో nani – సాయి పల్లవి లతో మిగిలిన నటీనటులు అందరూ పాల్గొనంటున్నారట. nani మొదటి సినిమా అష్ఠా చమ్మా నుంచి గత చిత్రం వి వరకు విభిన్నమైన కథలనే ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజా చిత్రం ‘శ్యామ్ సింఘ రాయ్’ ఉండబోతుందట. ఇక ఇప్పటికే టక్ జగదీష్ షూటింగ్ కంప్లీట్ చేసిన నాని.. త్వరలో అంటే సుందరానికీ అన్న సినిమాని సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నాడట. అంతేకాదు 2021 లో టక్ జగదీష్, ‘శ్యామ్ సింఘ రాయ్’, అంటే సుందరానికీ సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

 

 


Share

Related posts

బాబు ఇంటికి మళ్లీ నోటీసు

somaraju sharma

ఉద్దండరాయునిపాలెంలో ముగిసిన కాలభైరవ యాగం

somaraju sharma

డేటా చోరీ కేసుపై తెలంగాణ సిట్

sarath
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar