NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Karthika Deepam 2 April 25th 2024 Episode: దీప కోసం ఎవడో వచ్చాడట కదా అంటూ పారిజాతం దీర్ఘాలు తీస్తుంది. తన మాటలకు సుమిత్ర మరియు శివ నారాయణ అడ్డుకట్ట వేస్తారు. అప్పుడే శౌర్యని ఎత్తుకుని దశరథ కిందకు దిగుతాడు. తాతయ్య నాకు చాలా చాక్లెట్స్ ఇచ్చారని సంతోషంగా చెబుతుంది శౌర్య. ఇన్ని ఎందుకు ఇచ్చారని అంటుంది. నా కూతురికి పెళ్లయి పిల్లలు పుడితే మనవరాలితో ఆడుకుందామని అనుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు కూతురిని మరియు మనవరాలిని ఒకేసారి ఇచ్చాడు. తండ్రికి కూతురు మీద చనువు ఉంటుంది ఆ చదువుతోనే చెప్తున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండాలి అంటాడు దశరథ. అయినా వాళ్లకి బరువయ్యాను కానీ వాళ్లకు బాధ్యత అయ్యానని దీప మనసులో అనుకుంటుంది. సుమిత్ర నాకు మొత్తం చెప్పింది. చంటి దాన్ని ఇక్కడే స్కూల్ లో చేరుస్తానని చెబుతాడు. ఇక్కడ స్కూల్ అంటే లక్షల్లో ఖర్చు ఉంటుందని పారిజాతం అంటే దశరథ నారాయణ కౌంటర్ వేస్తాడు. ఇంక నువ్వు ఊరు వెళ్లే ఆలోచన మానుకోమని ప్రశాంతంగా ఉండవని చెబుతాడు. ఇప్పుడు నీకు కూతురు మాత్రమే కాదు కుటుంబం కూడా ఉంది.

Karthika Deepam 2 April 25th 2024 Episode
Karthika Deepam 2 April 25th 2024 Episode

నీ గురించి నిర్ణయం నేను తీసుకున్నాను నువ్వు ఉంటావు అంతేనని దశరథ తేల్చి చెప్పేస్తాడు. దీప మౌనంగా ఉండేసరికి ఏమైనా ఇబ్బందా అని అడుగుతారు. తాను ఇక్కడ ఏ పని చేయకుండా ఉండలేనని దీప చెబుతుంది. నీ ఇష్టం కానీ చేసేముందు తనకి ఇక మాట చెప్తే చాలని సుమిత్ర అంటుంది. ఎక్కడ నిన్ను ఎవరు ఏమి అనరు నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నాతో చెప్పమని చెబుతుంది. దీంతో దీప ఉండేందుకు ఓకే చెబుతుంది. దీప వెళితే ప్రశాంతంగా ఉందామని అనుకుంటే ఆపి నెత్తిన కూర్చోబెట్టారు. ఏం జరుగుతుందో ఏమోనని పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటుంది. అనసూయ కి డబ్బులు ఇచ్చి మల్లేష్ హైదరాబాద్ పంపిస్తాడు. తన ఇంటి జోలికి రావద్దని చెబుతుంది. నీ ఇల్లు పడగొట్టి వ్యాన్ షాప్ కట్టేస్తానని మల్లేష్ తాగా సంతోషపడతాడు. జ్యోత్స్న బర్తడే పార్టీ జరుగుతుంది. కార్తీక్.. దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరి బర్తడే లు ఒకేరోజు కానీ ఇక్కడ పార్టీ జరుగుతుంటే అక్కడ తనని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. దీప కు సాయం చేయడం గురించి ఆలోచిస్తాడు కార్తీక్. జ్యోత్స్న డాన్స్ చేస్తూ ఉంటే గౌతమ్ ‌.‌. కార్తీక్ ని చూస్తూ ఉంటాడు.

జ్యోత్స్న తన లవ్ ని రిజెక్ట్ చేసింది గుర్తు చేసుకుని రగిలిపోతూ ఉంటాడు. జ్యోత్స్న దగ్గరకు వచ్చి కార్తీక్ గురించి చెడుగా మాట్లాడేందుకు ట్రై చేస్తాడు. నువ్వు మీ బావకి ఇష్టమేనా.. తనకోసమే పుట్టానని చెప్తావు. కానీ మీ బావ పార్టీలో సంబంధం లేనట్టుగా కూర్చున్నాడని రచ్చ కొడతాడు. నువ్వు మీ బావతో డాన్స్ చేస్తే ప్రేమ ఉన్నట్టు అంటూ జ్యోత్స్న నీ పూరిస్తాడు. ఇక వెంటనే కార్తీక్ దగ్గరకు వెళ్లి తనతో డాన్స్ చేయమని అడుగుతుంది. గౌతమ్ ముందు ఆఫర్ చేస్తాడు. ఇష్టం ఉండదని కార్తీక్ అంటే పార్టీ అంటే ఇష్టం లేదా లేదంటే జ్యోత్స్న అంటే ఇష్టం లేదా అంటాడు. కార్తీక్ కి కోపం వస్తుంది. నీ అంత ఎఫెక్టివ్ గా మీ బావ నీ మీద ఉన్న లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం లేదని చుచ్చు పెడతాడు. బావా నువ్వు చెప్పచ్చు కదా జో నాకు కాబోయే భార్య.. తనంటే నాకు చాలా ఇష్టమని. అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదని ఇది తన వ్యక్తిగతమని అంటాడు. మరదలుగా మీ మీద నాకు ఎప్పుడూ అభిమానం ఉంటుందని చెప్పేసి కార్తీక్ వెళ్లిపోతాడు. నువ్వు ప్రేమ అంటున్నావు మీ బావ మాత్రం అభిమానం అంటున్నాడు అంటే ప్రేమ లేదన్నమాట అనిన గౌతమ్ జ్యోత్స్న అవమానిస్తాడు.

Karthika Deepam 2 April 25th 2024 Episode
Karthika Deepam 2 April 25th 2024 Episode

నీకు బావ అంటే ప్రాణం.. కానీ మీ బావకు నువ్వు కేర్ లెస్ అని రెచ్చగొడతాడు. అలా వారి మధ్య కొంత వాదోపవాదాలు జరుగుతాయి. ఇక తనకి ఇక్కడ ఉండటం అంటే చాలా ఇష్టమని శౌర్య చెబుతుంది. శౌర్య.. నరసింహ గురించి చెప్తుంది. తన ఇంటికి ఒక బూచోడు వచ్చాడు కదా అతన్ని నేను బట్టల షాప్ లో చూశాను.. బూచోడు మళ్లీ వస్తాడా? అంటే రాడని చెప్తుంది దీప. మరి నాన్న ఎప్పుడు వస్తాడని శౌర్య బాధగా అడుగుతుంది. అందరూ కనబడుతున్నారు కానీ నాన్న కనిపించడం లేదు మనం ఇక్కడే ఉండిపోతే నాన్నని ఎలా కలుస్తామని అంటుంది. నాన్నని వెతికేందుకు కార్తీక్ హెల్ప్ చేస్తానని చెప్పాడని అంటుంది. ఎక్కడ వెతకాల్సిన పని లేదని దీప చెబుతుంది. ఇక నాన్న గురించి అడగద్దు అని దీప గట్టిగా చెబుతుంది. నువ్వు ఎవరైతే బూచోడు అనుకుంటున్నావో వాడే నీ నాన్న అని దీప బాధపడుతుంది. నాకు నాన్న లేడు నీకు ఉన్న లేనట్లేనని దీప అనుకుంటుంది. కార్తీక్ ఒక్కడే ఇంటికి రావడంతో తనని ఎలా ఒంటరిగా వదిలేసి వచ్చారని తల్లిదండ్రులు నిలదీస్తారు. ఫోన్ వచ్చిందని అందుకే వచ్చానని చెబుతాడు. ఫోన్ కాల్ కు ఉండే ఇంపార్టెన్స్ కూడా నా కోడలికి లేదా అని కాంచన అంటుంది. జ్యోత్స్న కి చెప్పే వచ్చాను ఏం ఫీల్ అవ్వదులే అనేసి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri