Breaking: ట్యాంక్ బండ్ అందాలు చూడ లేక పోతున్నామని దానికి గల కారణం ట్రాఫిక్ అంటూ ఇటీవల ఓ నెటిజన్ సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ కి రిపోర్ట్ చేయడం జరిగింది. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ హైదరాబాద్ సీపీ తో చర్చలు జరిపినట్లు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఆదివారం కొత్తవి అమలు చేయాలని.. సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన అన్నారు.
ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ ఇచ్చిన సూచనల మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ప్రాంతాలకు… వాహనాలు అనుమతించకుండా ప్రవేశించకుండా సరికొత్త ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ఈ ఆంక్షలు ఆదివారం సాయంత్రం అయిదు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అమలులోకి రానున్నాయి. కేవలం కాలినడకన ట్యాంక్ బండ్ అందాలు చూడాలన్నే సందర్శకులకు మాత్రమే.. అనుమతులు ఉండేలా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది.