గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మండలంలోని ఉప్పాలపాడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్రమంలో పాకి పది ఇళ్ల దగ్ధం అయ్యాయి. స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో పాటు వారే స్వయంగా మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు.
ఫైర్ సిబ్బంది ఆలస్యంగా రావడం వల్లనే మంటలు పది ఇళ్లకు వ్యాపించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇళ్లలోని సామాను అంతా కాలి బూడద అయిపోయిందంటూ బాధితులు రోధిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఇళ్లలోని వారు బయటకు రావడంతో ప్రాణనష్టం జరగలేదు. అయితే ఎంత మేర ఆస్తినష్టం జరిగింది అనేది ఇంకా తెలియరాలేదు.