Gangavva : గంగవ్వ Gangavva తెలుసు కదా. అదేనండి.. మై విలేజ్ షో గంగవ్వ. బిగ్ బాస్ నాలుగో సీజన్ చూసిన వాళ్లకు, యూట్యూబ్ ఎక్కువగా చూసే వాళ్లకు గంగవ్వ సుపరిచితమే. తను యూట్యూబ్ లో ఎన్నో సంచలనాలను సృష్టించింది. బిగ్ బాస్ కంటే ముందు గంగవ్వ గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. మై విలేజ్ షో యూట్యూబ్ చానెల్ వాళ్లకు మాత్రమే తన గురించి తెలుసు. ఎప్పుడైతే గంగవ్వ బిగ్ బాస్ కు వెళ్లిందో అప్పుడే గంగవ్వ గురించి అందరికీ తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గంగవ్వకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది.

Gangavva : ప్రస్తుతం తెలుగులోనే టాప్ సెలబ్రిటీగా గంగవ్వ
బిగ్ బాస్ తర్వాత గంగవ్వ గ్రాఫ్ ఒక్కసారిగా పెరగడం, తనకు సెలబ్రిటీ హోదా రావడం.. నాగార్జున కూడా తన కోసం ఇల్లు కట్టించడం.. మిగతా సెలబ్రిటీలు కూడా తనను కలవడం.. ఇలా తను ఫుల్ టు బిజీ అయిపోయింది.
తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉండేందుకు గంగవ్వ.. ఒక యూట్యూబ్ చానెల్ కూడా పెట్టింది. ఆ చానెల్ లో తన పర్సనల్ వీడియోలు, విలేజ్ వీడియోలను పోస్ట్ చేస్తోంది గంగవ్వ.
అయితే.. తాజాగా గంగవ్వ హెలికాప్టర్ ఎక్కింది. తన చిన్నప్పటి నుంచి విమానం కానీ.. హెలికాప్టర్ కానీ ఎక్కాలనే కోరిక గంగవ్వకు ఉందట. దీంతో వేములవాడ వెళ్లి అక్కడ హెలికాప్టర్ ఎక్కి చివరకు తన కోరికను తీర్చుకుంది గంగవ్వ.
ఇంకెందుకు ఆలస్యం.. గంగవ్వ హెలికాప్టర్ ఎక్కిన వీడియోను మీరు కూడా చూసేయండి మరి.